కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా పిఆర్బిఎం జూనియర్ కాలేజీ హవా
రణం న్యూస్ కోరుట్ల, ఏప్రిల్ 12::తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో పట్టణంలోని పీఆర్బీఎం కళాశాల ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని జోనా ఫలాక్ బైపీసీ గ్రూప్లో 440కి గాను 433 అత్యధిక మార్కులు సాధించి సత్తా చాటింది. ఈ సంధర్బంగా కళాశాలలో జరిగిన సక్సెస్ మీట్ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పోతాని ప్రవీణ్ కుమార్

జోనా ఫలక్ ను అభినందించారు. తమ విద్యార్థులు గత 10 ఏండ్లుగా రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. మంచి మార్కులు సాధించి ప్రతిభా చాటిన విద్యార్థులను ఆయన సన్మానించారు.
అత్యధికంగా మార్కులు సాధించడం తనకి ఎంతో ఆనందాన్నికలిగించిందన్నారు. విజయానికి దోహదపడిన తల్లిదండ్రులు, అధ్యాపకులను సిబ్బంధిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

