తల్లి తండ్రులను నిరాదరిస్తే చూస్తూ ఊరుకొం..
జిల్లా సీనియర్ సిటిజెన్స్ అధ్యక్షులు హరి అశోక్ కుమార్
రణం న్యూస్ జగిత్యాల: ఏప్రిల్ 13:
జగిత్యాల పట్టణానికి చెందిన మాదారపు కనుకమ్మ (73)అనే పక్షవాతంతో భాద పడుతున్న వృద్ధురాలు జిల్లా సీనియర్ సిటిజెన్స్ అధ్యక్షులు హరి అశోక్ కుమార్ సాయంతో సోమవారం ప్రజావాణి లో కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు లో వివరాలు విలేకరులకు రోదిస్తూ తెలిపింది.ఇంటి నుంచి గెంటి వేయగా హనుమాన్ వాడ ఓ రేకుల షెడ్డులో తన పెళ్లి కాని కూతురుతో దుర్భర స్థితి లో జీవిస్తున్నానని,మేడి పల్లి మండలం దమ్మన్న పేట ప్రభుత్వ స్కూల్ లో హెడ్ మాస్టారు గా పనిచేస్తున్న నా కొడుకు మాదారపు గంగాదర్ వేతనం నుంచి 15శాతం డబ్బులు ప్రతి నెల తన బ్యాంకు ఖాతా లో జమచేయించాలని, తన వద్ద నుండి తీసుకున్న రూ. 10లక్షలు, 15తులాల బంగారం ఇప్పించాలని, నివా స వసతి కల్పించాలని కలెక్టర్ ను కోరింది. వృద్దురాలి వెంట ఆమె కూతురు శాంత,సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు, న్యాయవాది హరి అశోక్ కుమార్, జిల్లా ప్రతినిధులు పి. సి. హన్మంత్ రెడ్డి, గౌరి శెట్టి విశ్వ నాతం, బొల్లం విజయ్ బొబ్బటి కరుణ,ఎం. డి. యాకూబ్ పట్టణ అధ్యక్షులు మానాల కిషన్ తదితరులున్నారు.


