జంతు సంరక్షణ కేంద్రం నిర్వహణ పేరిట లక్షల నిధుల దోపిడి?
వీధి కుక్కల, ఇతర మూగ జీవాల సంరక్షణ సొమ్మును వదలని అధికారులు
కాగితాల పైనే బిల్లులు.. కేర్ మాత్రం నిల్..
రణం న్యూస్ కోరుట్ల: ఏప్రిల్4
(ఎడిటర్…ఆకుల మల్లికార్జున్)
జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన ఎనిమల్ కేర్ సెంటర్ పరిస్థితి చూస్తే, “సెంటర్ ఉంది… కేర్ లేదు” అన్నట్టుగా మారింది. పశువుల సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం కేటాయిస్తున్న లక్షల రూపాయల నిధులు ఎక్కడికి వెళ్లాయో తెలియని పరిస్థితి నెలకొంది. కేంద్రం పేరుతో షెడ్డు, బోర్డు మాత్రమే కనిపిస్తుండగా, లోపల ఒక్క జంతువు కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.పర్యవేక్షణకు ఒక్క ఉద్యోగి కూడా లేడు.. మెయిన్ గేట్ ను దొంగలెత్తుకెళ్లారు…చెత్తాచెదారం నిండిపోయి ఉంది. లక్షల నిధులు అధికారుల జేబుల్లోకి వెళ్ళయా..వీధి కుక్కలు ,ఇతర జంతువుల పేరిట వచ్చిన నిధులను కూడా అధికారులు వదలట్లేదని ఈ కోరుట్ల ఏమిమల్ కేర్ సెంటర్ ను చూస్తే నే తెలుస్తుంది.

ఎనిమల్ కేర్ సెంటర్ (జంతు సంరక్షణ కేంద్రం) లక్ష్యం
మున్సిపల్ పరిధిలోని ఎనిమల్ కేర్ సెంటర్ల నిర్వహణకు లక్షల రూపాయల నిధులు ఏటా కేటాయిస్తారు.ఈ కేర్ సెంటర్ లు కేవలం పేరుకే కాకుండా, జంతు సంరక్షణలో కీలక బాధ్యతలు నిర్వహించాల్సినవిగా ఖచ్చితమైన నియమ నిబంధనలు ఉన్నాయి. వీధి కుక్కలు, ఇతర జంతువులను పట్టుకుని వాటికి స్టెరిలైజేషన్ చేసి జనాభా నియంత్రణ చేయడం ప్రధాన విధి. గాయపడిన, అనారోగ్యంతో ఉన్న జంతువులకు తక్షణ వైద్య చికిత్స అందించాలి. రేబీస్ వంటి వ్యాధుల నివారణకు వ్యాక్సినేషన్ కార్యక్రమాలు నిర్వహించాలి. శస్త్రచికిత్స అనంతరం జంతువులను కొద్ది రోజులు సంరక్షణలో ఉంచి కోలుకునేలా చూడాలి. సరిపడా ఆహారం, తాగునీరు, శుభ్రమైన ఆశ్రయం కల్పించాల్సి ఉంటుంది. అవసరమైనప్పుడు జంతువులను రక్షించి సురక్షితంగా తరలించే వాహన సదుపాయం ఉండాలి. మృత జంతువుల నిర్వహణను శాస్త్రీయంగా చేపట్టాలి. ఈ విధులన్నింటినీ పారదర్శకంగా అమలు చేయడమే ఎనిమల్ కేర్ సెంటర్ అసలు లక్ష్యం.
కాగితాల పైనే బిల్లులు.. కేర్ మాత్రం నిల్..
ప్రభుత్వం ప్రతీ సంవత్సరం జంతు సంరక్షణ పేరుతో కేటాయించే నిధులు వాస్తవంగా వినియోగం అవుతున్నాయా? లేక కేవలం బిల్లులు, రికార్డులలోనే తిరుగుతున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. “ఈ జంతు సంరక్షణ కేంద్రం” కోసం ఖర్చు చూపిస్తారు… కానీ కేర్ ఎక్కడ?” అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
కుక్కలు, ఇతర మూగ జీవాల రక్షణకు వచ్చే సొమ్ము ను వదలని అధికారులు
ఎనిమల్ కేర్ సెంటర్ లు గాయపడిన జంతువులకు చికిత్స, వీధి కుక్కల నియంత్రణ, పశువులకు ఆహారం ఆశ్రయం కల్పించాలి. కానీ ఇక్కడ మాత్రం ఆ లక్ష్యాలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. ఈ కేంద్రం ఎప్పుడూ మూతపడినట్టే ఉంటుంది. అసలు సిబ్బంది లేకపోవడం. నిర్వహణపై ఎలాంటి పర్యవేక్షణ కనిపించకపోవడం చూస్తే నోరు లేని మూగజీవాల రక్షణ కి వచ్చే సొమ్మును కూడా అధికారులు వడలకపోవడం అధికారుల అవినీతి కి అద్దం పడుతోంది.
ఉన్నతాధికారులు విచారణ జరపాలి….

ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించి, వాస్తవ పరిస్థితిని పరిశీలించాలి. నిధుల వినియోగంపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే, “ఎనిమల్ కేర్ సెంటర్ పేరుతో వచ్చే నిధులను నొక్కేసిన అధికారులు పై కఠిన చర్యలు చేపట్టని యెడల మరో మోసపూరిత అవినీతికి కేంద్రంగా మన కళ్ళకు కట్టినట్లు కనపడుతుంది.

