సమానత్వం చాటాల్సిన రోజే ఆధిపత్య పోరు
రణం న్యూస్ కోరుట్ల రూరల్ ఆగస్టు15, కోరుట్ల మండలం కల్లూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహ సాక్షిగా జెండా ఎగురవేసే విషయంలో మాజీ సర్పంచ్ అంజయ్య, మాదిగ సంఘం అధ్యక్షుడు రాజేష్ మధ్య వివాదం చోటుచేసుకుంది.నేను గ్రామ మాజీ సర్పంచ్‌ను, కులపెద్దను” అంటూ అంజయ్య జెండా పట్టుకుని తనే ఎగురవేయాలని వాదించారు.
అయితే సంఘ అధ్యక్షుడిగా జెండా ఎగురవేసే హక్కు తనదేనంటూ రాజేష్ జెండాను లాక్కుని ఎగురవేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఐక్యత, సమానత్వం చాటాల్సిన చోటే ఆధిపత్య పోరు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.పదవులు, హోదాలు, కులపెద్దల పేరుతో జెండా ఎగురవేతపై పోటీ పడటం పలువురిని విస్మయానికి గురిచేసింది.అంబేద్కర్ విగ్రహం ఎదుటే చోటుచేసుకున్న ఈ పరిణామం సామాజిక ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తింది.సంఘం నాయకత్వం, గ్రామ పెద్దరికం రెండూ ప్రజాసేవకే తప్ప ఆధిపత్య ప్రదర్శనకు కాదని పలువురు అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ చూపిన సమానత్వ మార్గాన్ని స్మరించాల్సిన రోజునే చోటుచేసుకున్న ఈ ఘటన ఆత్మపరిశీలన చేయాల్సిన పరిస్థితిని కల్పించింది.
అంబేద్కర్ సాక్షిగా జెండా కోసం జరిగిన ఈ పోరు—ఆయన ఆశయాలను మనం ఎంతవరకు ఆచరిస్తున్నామన్న ప్రశ్నను మాత్రం బలంగా మిగిల్చింది*
