ఘనంగా సత్కరించిన హైకోర్టు న్యాయమూర్తి…
రణం న్యూస్ కోరుట్ల:ఏప్రిల్18,
భారత న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థాయి పరిశోధన, వృత్తిపరమైన ప్రతిభను కనబరిచిన మెట్పల్లి సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్రావును రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తి, జగిత్యాల జిల్లా పోర్ట్ఫోలియో జడ్జి రేణుక యారా శాలువతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. శనివారం కోరుట్లలో నూతనంగా ఏర్పాటు చేసిన అదనపు జూనియర్ సివిల్ జడ్జి, అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిధిగా హాజరైన హైకోర్టు న్యాయమూర్తి హాజరయ్యారు.

ఇటీవల మెట్పల్లి సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్రావు నిర్వహించిన చట్టపరమైన పరిశోధనలను అలహాబాద్ హైకోర్టు, దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రామాణికంగా స్వీకరించిన విషయం తెలిసిందే. పోలీసు దర్యాప్తులో పాటించాల్సిన చట్టబద్ధమైన విధానాలు, రక్షణలపై ఆయన చేసిన చేసిన పరిశోధనలను అలహాబాద్ హైకోర్టు, సుప్రీం కోర్టు రెండు కేసులలో ఉదహరించిన నేపథ్యంలో నాగేశ్వర్రావుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హైకోర్టు న్యాయమూర్తి రేణుక యారా మాట్లాడుతూ మంథనిలో జూనియర్ సివిల్ జడ్జిగా ఉన్న కాలం నుంచి న్యాయపరిశోధన పట్ల చూపుతున్న నిబద్ధతను ఆమె అభినందించారు. నాగేశ్వర్రావు అందించిన మార్గదర్శకాలు దర్యాప్తు సంస్థలకు, యువ న్యాయమూర్తులకు దక్సూచిగా నిలుస్తాయని పేర్కొన్నారు. జిల్లా న్యాయమూర్తి రత్నాపద్మావతి మాట్లాడుతూ మెట్పల్లి జ్యుడీషియల్ అధికారి, సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్రావుకు జాతీయ స్థాయిలో ఇలాంటి గుర్తింపు రావడం మన ప్రాంతానికి గర్వకారణమని అన్నారు. ఆయన పరిశోధనలకు అలహాబాద్ హైకోర్టుతో సుప్రీంకోర్టు తీర్పుల్లో చోటు లభించడం అభినందనీయమని కొనియాడారు

