ప్రజాసేవలో జువ్వాడి కుటుంబం
ఆద్యంతం ప్రజాహితమే…
మొగ్గ ఓని మొక్కనే వటవృక్షమైంది
రణం న్యూస్ డెస్క్: మే 9,
(ఎడిటర్..ఆకుల మల్లికార్జున్)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచే ప్రజా సేవా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు జువ్వాడి నర్సింగరావు. రాజకీయంగా పార్టీని ఒంటబెట్టుకుని నడిపించిన నాయకుడిగా, కోరుట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఐఐసీ డైరెక్టర్ పదవి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఐఐసీ డైరెక్టర్గా పనిచేసిన నర్సింగరావు, ప్రజలతో మమేకమై పనిచేసే నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన రాజకీయ ప్రస్థానానికి పునాది వేసింది కుటుంబ వారసత్వమే. ఆయన తండ్రి మాజీ మంత్రి రత్నాకర్ రావు రాష్ట్ర రాజకీయాల్లో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు. అదే సేవా భావాన్ని నర్సింగరావు కొనసాగిస్తూ ప్రజల మనసుల్లో నిలిచారు.

కుటుంబ నేపథ్యమే సేవాదృక్పథం..
కోరుట్ల నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన నర్సింగరావు, ఎన్నో రాజకీయ ఒడిదుడుకుల మధ్య కూడా పార్టీ జెండాను భుజాన మోసిన నాయకుడిగా పేరుపొందారు. కష్టకాలంలోనూ పార్టీని వీడకుండా, కార్యకర్తలకు అండగా నిలుస్తూ నిబద్ధతకు ప్రతీకగా నిలిచారు.అన్నదమ్ముల అనుబంధానికి నిదర్శనంగా నిలిచే ఈ కుటుంబంలో తమ్ముళ్లు జువ్వాడి కృష్ణారావు, జువ్వాడి శేఖర్ రావు ఎల్లప్పుడూ నర్సింగరావుకు బలంగా నిలిచారు. కుటుంబ సమైక్యత, రాజకీయ నిబద్ధత కలిసివచ్చి ఆయనను మరింత ప్రజానాయకుడిగా తీర్చిదిద్దాయి.
మొగ్గ ఓని మొక్కనే వటవృక్షమైంది
మొగ్గ ఓని మొక్కనే వటవృక్షమైంది
అన్నట్లుగా చిన్న స్థాయి నుంచి ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ వచ్చిన నర్సింగరావు, నేడు తెలంగాణ రాష్ట్ర స్థాయి వెలమ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నిక కావడం ఆయన రాజకీయ జీవితం లో మరో మైలురాయిగా భావిస్తున్నారు..ఈ పదవిని కాంగ్రెస్ పార్టీ ఆయన సేవలకు ఇచ్చిన గౌరవంగా కార్యకర్తలు అభివర్ణిస్తున్నారు. నియోజకవర్గ స్థాయి నాయకుడిని రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్గా నిలబెట్టడం ద్వారా పార్టీ నిబద్ధతకు విలువ ఇస్తుందనే సంకేతాన్ని కాంగ్రెస్ ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రజా సేవ, పార్టీ పట్ల విశ్వాసం, కుటుంబ అనుబంధం ఈ మూడు విలువలను సమన్వయం చేసుకున్న నాయకుడిగా జువ్వాడి నర్సింగరావు రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు.

