హుజురాబాద్ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో ఇంచార్జ్ కోరుట్ల అధికారే
అక్కడ ఏ సి బి చిక్కిన ఇంజనీర్….కోరుట్ల అధికారి పేరు వెల్లడించిట్లు సమాచారం
పట్నం లో పైరవీల బిజిలో కోరుట్ల ఇంజనీరింగ్ ఉన్నత అధికారి..
అధికారి ,వారి కుటుంబ సభ్యుల ఫోన్లు రోజంతా స్విచ్ ఆఫ్‌లో
రణం న్యూస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏప్రిల్ 17
హుజురాబాద్‌లో ఏసీబీ వలలో చిక్కుకున్న మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అధికారి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, అదే కేసు కు సంబంధించి వ్యవహారం కోరుట్ల మున్సిపల్ కార్యాలయాన్ని కూడా కుదిపేస్తున్నాయి. హుజురాబాద్‌లో ఇంచార్జ్‌గా వ్యవహరస్తున్న కోరుట్ల మున్సిపాలిటీ కి చెందిన ఆ ఇంజనీరింగ్ సెక్షన్ లో ఉన్నత అధికారి పేరు ఏసీబీ విచారణలో బయటపడినట్లు వినిపిస్తున్న ఆరోపణలు ఇక్కడి ఇంజనీరింగ్ విభాగంలో కలకలం రేపుతున్నాయి.
హుజురాబాద్ మున్సిపల్ ఇంజనీరింగ్ ఇంచార్జ్ కోరుట్ల అధికారి
కోరుట్లలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సదరు ఇంజనీరింగ్ ఉన్నత అధికారి, హుజురాబాద్‌లో కూడా ఇంచార్జ్ బాధ్యతలు నిర్వహిస్తూ అక్రమ వ్యవహారాలకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హుజురాబాద్ లో ఏ ఈ పై ఏసీబీ అధికారుల ప్రశ్నల సందర్భంగా కోరుట్ల అధికారి పేరు వెలుగులోకి వచ్చిందన్న ప్రచారం, స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది. అధికారికంగా ధృవీకరణ లేకపోయినా, ఈ వార్తలు మున్సిపల్ సిబ్బందిలో భయాందోళనలను పెంచుతున్నాయి.
ఇదిలా ఉంటే,ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కోరుట్లలో ఉన్న ఆ ఇంజనీరింగ్ ఉన్నత అధికారి కుటుంబ సభ్యుల మొబైల్ ఫోన్లు ఒక రోజు మొత్తం కూడా స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకపోవడం మరిన్ని అనుమానాలకు తావిచ్చాయి. రోజంతా ఫోన్లు స్విచ్ ఆఫ్‌లో ఉండటం, కార్యాలయానికి కూడా హాజరు కాకపోవడం వంటి పరిణామాలు “ఏదో అవినీతి ప్రయత్నం దొరికి పోయింది అనే అభిప్రాయాలను బలపరుస్తున్నాయి.

పట్నం లో పైరవీల బిజిలో కోరుట్ల ఇంజనీరింగ్ ఉన్నత అధికారి..
ఇంకా, కే సు నుంచి బయటపడేందుకు కోరుట్ల అధికారి హైదరాబాద్‌లో పైరవీలు చేస్తున్నారన్న వార్తలు వినిపించడం పరిస్థితిని చూస్తేనే తేట తెల్లమవుతుంది. కొందరు పైరవి కారుల ద్వారా ఒత్తిళ్లు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతుండగా, ఇదిలా ఉండగా మున్సిపాలిటీ అవినీతి కంపుకొట్టే మురికిపాలిటీ అని ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది.
హుజురాబాద్ మున్సిపల్ ఏఈ… ప్రొహిబిషన్ సమయంలోనే లంచావతారి

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) నుసుం సుధాకర్ రెడ్డి అవినీతి వ్యవహారం వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విధుల్లో నిషేధం (ప్రొహిబిషన్) పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ, లంచాలు తీసుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వివరాల ప్రకారం, మున్సిపాలిటీ పరిధిలో వర్షపు నీటి కాలువ నిర్మాణ పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్‌కు తుది బిల్లు క్లియర్ చేయడానికి, మెజర్మెంట్ బుక్ నమోదు చేయాలనే నెపంతో ఏఈ రూ.50,000 లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో, అధికారులు వ్యూహాత్మకంగా ఉచ్చుపన్ని నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నరు.

