దిక్కున్నచోట చెప్పుకో అంటూ… ప్రిన్సిపాల్ ,యాజమాన్యం బెదిరింపులు
అంబెడ్కర్ జయంతి రోజు వేతనం కోసం విద్యావంతుడు పోరాటం…
రణం న్యూస్ కోరుట్ల: ఏప్రిల్ 14,
విద్యా రంగం పవిత్రతను కోల్పోయి వ్యాపార ధోరణిలో నడుస్తోందనే ఆరోపణలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కంప్యూటర్ లెక్చరర్ గా వేతన ఒప్పందంతో నియమించి, తరువాత ఒప్పందాలు ఉల్లంఘించడం వంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా కోరుట్లలోని “రష్మీదర్ తేజ డిగ్రీ కాలేజీపై” ఇదే తరహా ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

కంప్యూటర్ సైన్స్‌లో పీజీ పూర్తి చేసిన యూసుఫ్ నగర్ గ్రామానికి చెందిన లెక్చరర్ నాగరాజు కోరుట్లలోని “రమ్మీదర్ తేజ డిగ్రీ కాలేజీ”లో మూడు నెలల ఒప్పందంతో పనిచేశాడు. నెలకు రూ.22,000 వేతనం చెల్లిస్తామని కాలేజీ ప్రిన్సిపాల్ , యాజమాన్యం హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ ప్రకారం మొత్తం మూడు నెలలకు రూ.66,000 చెల్లించాల్సి ఉండగా, యాజమాన్యం కేవలం రూ.30,000 మాత్రమే ఇచ్చి మిగిలిన మొత్తాన్ని ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.అంతేకాకుండా, “ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో” అంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని బాధిత లెక్చరర్ ఆవేదన వ్యక్తం చేశారు. తనలాంటి మరికొందరు విద్యావంతులను కూడా ఇదే విధంగా ఉపయోగించుకుని వదిలేశారని, దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో, తనకు న్యాయం చేయాలని కోరుతూ కాలేజీ ముందు కూర్చుని నాగరాజు అనే లెక్చరర్ ధర్నాకు దిగారు. విద్యా సంస్థలలో జరుగుతున్న ఈ తరహా దోపిడీపై చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులను ఆయన కోరుతున్నారు.

