జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్..
ర్యాలీలో పాల్గొన్న జిల్లావైద్యాధికారి సుజాత.
క్షయవ్యాధి పట్ల జాగ్రత్తలు వహించాలి..ఉప వైద్యాధికారి ఎన్.శ్రీనివాస్
రణం న్యూస్ జగిత్యాల: మార్చి24,
జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి సుజాత ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీ నుండి రహదారులపై ర్యాలీ నిర్వహిస్తూ క్షయవ్యాధి పై ప్రజలకు అవగాహన కల్పించారు. “క్షయవ్యాధి నివారణ మనందరి బాధ్యత”, “లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోండి”, “సమయానికి మందులు తీసుకుంటే క్షయవ్యాధి పూర్తిగా నయం అవుతుంది” వంటి నినాదాలతో ర్యాలీ కొనసాగింది.

ఈ సందర్భంగా జిల్లా ఉపవైద్యాధికారి ఎన్. శ్రీనివాస్ మాట్లాడుతూ మాట్లాడుతూ క్షయవ్యాధి ఒక సంక్రమణ వ్యాధి అయినప్పటికీ సరైన చికిత్సతో పూర్తిగా నయం అవుతుందని తెలిపారు. రెండు వారాలకు పైగా దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, రాత్రిళ్లు చెమటలు రావడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఉచితంగా పరీక్షలు, మందులు అందిస్తోందని, రోగులు చికిత్సను మధ్యలో ఆపకుండా పూర్తిగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.అదనంగా, క్షయవ్యాధి నిర్మూలనలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి కూడా వివరించారు. రోగులకు పోషకాహారం కోసం ఆర్థిక సహాయం, ఉచిత ఔషధాలు, నిరంతర వైద్య పర్యవేక్షణ వంటి సదుపాయాలు అందిస్తున్నట్లు తెలిపారు.

ఈర్యాలీద్వారాప్రజల్లోక్షయవ్యాధిపైతొలగించి,ముందస్తుజాగ్రత్తలుతీసుకోవాలనేచైతన్యంపెంపొందించడమే ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపవైద్యాధికారి శ్రీనివాస్,ముస్కు జైపాల్ రెడ్డి,వైద్యకలాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్,సూపరెండేంట్ రామకృష్ణ,, మున్సిపల్ చైర్ పర్సన్ సమీడ్ల వాణి శ్రీనివాస్ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ నరేందర్,వైద్యాధికారులు,ఎన్ సి డి ప్రోగ్రాంఅధికారిరాజేందర్రెడ్డి,వైద్యులు,వైద్యసిబ్బంది,మెడికల్ కాలేజ్ విద్యార్థులు,ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

