ఎవరు ఏం చేయలేరంటూ … ఓ రియల్ వ్యాపారి దురుసు ప్రవర్తన
అధికార పార్టీ ముఖ్య నాయకుడు మావాడే…మంత్రి మావాడే…
స్థానిక నిజయోక వర్గ ,రాష్ట్ర పార్టీ ముఖ్య నాయకుల్ని లెక్కచేయని వైనం…
భూముల్ని కాపాడాలని మంత్రి కి పిర్యాదు చేసిన ఎమ్మెల్యే…
రణం న్యూస్ కోరుట్ల: మార్చి18
(ఎడిటర్..ఆకుల మల్లికార్జున్)
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అధికారంలో ఏ పార్టీ ఉన్నా, వారికి దగ్గరగా ఉండే ఒక బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి చట్టాలను తుంగలో తొక్కుతూ తనదైన తరహాలో ఎవర్ని లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్నాడన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. “మాకు రాష్ట్ర ముఖ్య నాయకుడే మావాడు… మంత్రి కూడా మావాడే… ఎలాంటి అనుమతులు మాకు అవసరం లేదు” అని పలువురితో పలుచోట్ల దురుసుగా వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.
అధికార పార్టీ ముఖ్యనాయకుల్ని లెక్కచేయని వైనం…
కోరుట్ల నియోజక వర్గ ,ఇదే ప్రాంతానికి చెందిన రాష్ట్ర స్థాయి అధికార పార్టీ ముఖ్య నాయకుల్ని సైతం లెక్కచేయకుండా ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వ్యవహరిస్తున్న తీరు స్థానికంగా చర్చనీయాంశమైంది.
భూముల వ్యవహారాల్లో స్థానికి నాయకుల్ని పట్టించుకోకుండా అధికారులను ప్రభావితం చేస్తూ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కోరుట్ల ప్రాంత అధికార పార్టీ ముఖ్య నేతల జోక్యాన్నికూడా పట్టించుకోకుండా తన ప్రభావంతో పనులు సాధిస్తున్నాడని స్థానికులు ఆరోపిన్నారు.
ఈ పరిస్థితిపై అధికార పార్టీ నాయకులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
అధికార వ్యవస్థను మించిన ప్రభావం ఎలా సాధ్యమవుతోందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వ్యవహారంపై స్థానిక పార్టీ నాయకులు ఎవరు ఏ విదంగా స్పందిస్తారో వేచి చూద్దాం.
భూముల్ని కాపాడలంటూ మంత్రి పిర్యాదు చేసిన ఎమ్మెల్యే…
ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే సైతం ఈ అంశంపై జిల్లా మంత్రికి ఫిర్యాదు చేసినా, ఎలాంటి చర్యలు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇది సాధారణ నిర్లక్ష్యమా? లేక అధికార యంత్రాంగం పై ప్రభావం చూపే దోపిడీ వ్యవస్థ పట్టు బిగిసిందా? అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
నిబంధనలకు పాతర… ప్రేక్షక పాత్రలో అధికారులు..
రియల్ ఎస్టేట్ రంగం పేరుతో నిబంధనలు ఉల్లంఘించడం, లేఅవుట్లకు అవసరమైన అనుమతులు లేకుండా ప్లాట్లు అమ్మడం, రోడ్లు, డ్రైనేజీ, బఫర్ జోన్ వంటి మౌలిక సదుపాయాలను పట్టించుకోకపోవడం వంటి ఆరోపణలు గాలిలో వినిపిస్తున్నాయి. ఇవి నిజమైతే, అది కేవలం చట్టాల ఉల్లంఘన మాత్రమే కాదు..ప్రజల భవిష్యత్తుతో ఆడుకునే ప్రమాదకరమైన సమస్య.

