రైతులను ఆదుకోవాలి..
రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఆకుల రంజిత్
రణం న్యూస్ కోరుట్ల: నవంబర్ 5.
రైతుల నుంచి నేరుగా మద్దతు ధరతో కొనుగోలు చేసిన ధా న్యాన్ని సీఎంఆర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రైస్‌మిల్లర్లకు కేటాయించడం అందరికి తెలిసిన విషయమే. ఈ ధాన్యం పొందిన రైస్ మిల్లుల నిర్వాహకులు కొందరు సీఎంఆర్ వందశాతం డెలి వరీ చేయలేదుకొందరు అధికారులు ప్రభుత్వ ఆదేశాలను పెడచెవిన పెడుతున్నారు. ధాన్యాన్ని పక్కదారి పట్టించిన రైస్ మిల్లర్లపై వల్లమాలిన ప్రేమ కనబరుస్తున్నారని. రైస్ మిల్లులో దాన్యం నిల్వలలో అవకతవకల గురించి సమగ్ర విచారణ పారదర్శకమైన వడ్ల నిల్వల తనిఖీలు నిర్వహించాలి. రైస్ మిల్లుల మాఫియా వ్యాపారం గురించి అధికారులతో సమగ్ర విచారణ జరిపించాలి. 2022-23 ఎండ కాలం (రబీ) సీజన్ యొక్క బకాయిలు రాబట్టుటలో రాష్ట్ర పౌరసరఫరాల యంత్రాంగం చాలా ఘోరంగా విఫలమైనది. దీనితో ఈ సీజన్ కు గాను రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4500 కోట్లు నుండి 5000 కోట్ల బకాయిలు పేరుకపోయి ఉన్న బకాయిలను వసూలు చేయాలన్నారూ.ఇట్టి బకాయిలు వసూల్ చేయడంలో విఫలానికి కారణం అధికారులకు, నాయకులకు ఎన్ని ముడుపులు ముట్టాయని ఆరోపించారు. రూ॥ 500/-లు బోనస్ వరి దాన్యం డబ్బులను వెంటనే విడుదల చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు.వారి నుంచి రావాల్సిన కస్టమ్ మిల్ల్డ్ రైస్ (సీఎంఆర్)ను రికవరీ చేయడం లేదు. సీఎంఆర్ ఇవ్వని రైసుమిల్లులకు ప్రభుత్వం పలు మార్లు గడువు విధించింది.

అయినప్పటికీ ధాన్యాన్ని డెలివరీ ఇవ్వని కొన్ని రైస్ మిల్లులు సీజ్ చేసి కక్ష సాధింపు చేస్తూ తమకు అనుకూలంగా ఉన్న మిల్లర్లు కోట్లలో బకాయి లు ఉన్న వారికి వంతపాడటం వారికే ధాన్యాన్ని కేటాయించడం అధికారులు మిల్లర్లు కుమ్మక్కు అయి ఈ దందా కు వత్తాసు పలుకున్తున్నారని అలాంటి వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని రైతు నాయకులు ఆకుల రంజిత్ ధ్వజమెత్తారు.ఏళ్లు గడిచినా సీఎంఆర్ డెలివరీ ఇవ్వని రైస్ మిల్లర్లపై అధికారులు చర్యలకు వెనుకడుగు వేస్తున్నారని విమర్శించారు. కొందరు అధికారులు గత బిఅరెస్ ప్రభుత్వము,ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ధాన్యాన్ని పక్కదారి పట్టించిన రైస్ మిల్లర్లపై వల్లమాలిన ప్రేమ కనబరుస్తున్నారని ఆరోపించారు. వారి నుంచి రావాల్సిన కస్టమ్ మిల్ల్డ్ రైస్ (సీఎంఆర్)ను రికవరీ చేయడం లేదు. సీఎంఆర్ ఇవ్వని రైసుమిల్లులకు ప్రభుత్వం పలు మార్లు గడువు విధించింది. అయినప్పటికీ ధాన్యాన్ని డెలివరీ ఇవ్వని ఆరు రైస్‌మిల్లులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొనేవరకు పోరాడతామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో కలాల సాయిచంద్,బీమానాతి శ్రీధర్,కొండల్ రెడ్డి,సదుల సుదర్శన్,కటుకం రాజేశం బోయ నర్సారెడ్డి,బోదాసు మహేష్,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

