రణం న్యూస్ కోరుట్ల:ఆగస్ట్ 30

వినాయక నవరాత్రులను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా SP అశోక్ కుమార్ పలు వినాయక మండపాలను ప్రత్యేకంగా దర్శించుకొన్నారు. ప్రత్యేక పూజలు చేసి మండపం నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.భక్తి శ్రద్ధలతో నవరాత్రులు నిర్వహించుకోవాలని శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.పోలీస్ అవగాహన పోస్టర్ వినాయక మండపాల మధ్య ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో కోరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, సబ్ ఇన్స్పెక్టర్ మంద చిరంజీవి పాల్గొన్నారు.
