
రణం న్యూస్ ::
ఉత్తమ ఉద్యోగ అవార్డులు కూడా జిల్లా అధికారుల కు నచ్చినవారికే అందుతున్నాయటం లో అతిశయోక్తి లేదు. ఉత్తమ ఉద్యోగి గా అవార్డ్ అందుకున్న ఉద్యోగి ఎసీబీ చిక్కడం అదికూడా పన్నెండు రోజుల వ్యవధిలోనే చిక్కడం ఈ అవార్డులు పారదర్శాకంగానే ఇస్తున్నారా లేక తమ అనుయాయులకే ఇస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం ఆతున్నాయి 79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా మంత్రి కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగిగా పురస్కారం అందుకున్నాడు. పదిహేను రోజులు కూడా కాకుండానే లంచం తీసుకుతీసుకుంటు అవినీతి నిరోధక శాకాధికారులకు రెడ్ హాండెడ్ గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు ఆయన ఆస్థులపై ఆరాతీస్తున్నారు.
వివారాల్లోకి వెళితే సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఇంజనీరింగ్ కన్సల్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న పరశురాములు మంత్రి పొన్నం ప్రభాకర్,సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమవతిచేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగిగా పురస్కారం అందుకున్నాడు.ఫైళ్ల కొలతలను ధ్రువీకరించడం, బిల్లు ఆమోదం కోసం ఉన్నత అధికారులకు పంపడం కోసం ఫిర్యాదుదారుడి నుండి 11,500 రూ లంచం డిమాండ్ చేశాడు.మద్దూర్ ఎంపీడీవో కార్యాలయంలో పరుశురాములు డబ్బులు తీసుకుంటున్న క్రమంలో పట్టుకున్న ఏసీబీ అధికారులు.

