మెట్ పల్లి డిఎస్పీ అడ్లూరి రాములు
రణం: న్యూస్ కోరుట్ల:ఆగస్ట్22

జాయిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ, మండల స్థాయి పీస్ కమిటీ సమావేశం స్థానిక వాసవి కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మెటపల్లి డీఎస్పీ అడ్లూరి రాములు పాల్గొన్నారు. డిఎస్పీ రాములు మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాన్ని చట్టబద్ధంగా, భక్తిశ్రద్ధలతో, సాంఘిక సమతా వాతావరణంలో జరపకోవాలని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని సూచించారు.డీజే లకు అనుమతులు లేవని, వీటిని పూర్తిగా నిషేధించినట్లు ,మండపాల వద్ద ఆసాంఘీక కార్యకలాపాలకు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హితవుపలికారు.ఈకార్యక్రమంలో తహసీల్ధార్ కృష్ణ చైతన్య మున్సిపల్ కమిషనర్ రవీందర్,ఎంపిడిఓ రామకృష్ణ, విద్యుత్ అధికారులు కోరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, ఎస్ ఐ మంద చిరంజీవి, గణేష్ మండపాల నిర్మావహకులు పాల్గొన్నారు.

