సొంత ఊరిలో మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి@ దేవ్ జీ
అజ్ఞాతం నుంచి ప్రజాక్షేత్రం దాకా… “దేవ్ జి” ప్రయాణం కావాలి మార్గదర్శనం
రణం న్యూస్ కోరుట్ల ఏప్రిల్ 8
నాలుగు దశాబ్దాల పాటు అజ్ఞాతంలో గడిపిన మావోయిస్టు నాయకుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జి… ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టడం ఒక సాధారణ సంఘటన కాదు ఒక చరిత్రాత్మక మలుపు. కాలం గడిచే కొద్దీ ఆలోచనల మార్గమే శాశ్వతమని గ్రహించిన ఆయన, చివరకు లొంగిపోయి ప్రజల మధ్యకు రావడం సమాజానికి కొత్త సందేశాన్ని ఇస్తోంది.

సొంత గ్రామం ప్రస్తుతం పట్టణం నియోజకవర్గ కేంద్ర ము కోరుట్లలోకి అడుగుపెట్టిన ఆయనకు బంధుమిత్రులు ఇచ్చిన స్వాగతం భావోద్వేగభరితంగా మారింది. నాలుగు దశాబ్దాల దూరం ఒక్క క్షణంలో దూరమైనట్లుగా ఆ వీదిలో చిన్న పెద్దలకు బంధువులకు మిత్రులలో ఆనందం వెల్లివిరిసింది. గతాన్ని వెనక్కి నెట్టేసి, కొత్త జీవన పంథాలో ముందుకు సాగాలనే ఆయన సంకల్పం ప్రతి మాటలో కంపించింది.
కులం, మతం, భాష అనే తారథమ్యాలు లేకుండా వాటిని దాటి ప్రజల మధ్యకు వచ్చి సేవ చేయడమే నా లక్ష్యం అని దేవ్ జి చేసిన వ్యాఖ్యలు మనకు కళ్ళకు కట్టినట్లు కనిపించాయి..
వివాదాస్పద వ్యాఖ్యలు చేయబోనని, ప్రజాక్షేత్రంలో సానుకూల పాత్ర పోషిస్తానని స్పష్టం చేసిన ఆయన, దేశ ప్రజలందరూ నా బంధువులే దేశమే నా కుటంబం అని చెప్పడం ద్వారా తన కొత్త మార్గాన్ని ప్రజలకు తెలియజేశారు.

దేవ్ జి అడుగు జాడలు మార్పు కు బాటలు వేయాలి:-
ఇది కేవలం ఒక వ్యక్తి మార్పు కాదు ఒక భావజాల పరివర్తన.ఒకప్పుడు అడవుల్లో ఆయుధాలతో నడిచిన అడుగులు… ఇప్పుడు ప్రజాక్షేత్రంలో సేవా సంకల్పంతో ముందుకు సాగడం కాలం ఇచ్చిన గొప్ప తీర్పు..సమాజం కూడా ఇలాంటి మార్పులను స్వాగతించాల్సిన అవసరం ఉంది. దేవ్ జి అడుగు కేవలం కోరుట్లకు పరిమితం కాదు ఇది సమాజానికి మార్గదర్శకం కావాలని కోరుకుందాం

