చోద్యం చూస్తున్ రెవెన్యూ అధికారులు…
నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారులు
రణం న్యూస్ కోరుట్ల మార్చి26
(ఎడిటర్..ఆకుల మల్లికార్జున్)
కోరుట్ల పట్టణంలో ప్రజల ప్రయాణానికి మూలస్తంభాలైన హద్దీ రాస్తాలు కబ్జాదారుల బారిన పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సాయిబాబా గుడి ముందు నుండి వెంకటాపూర్ వైపు వెళ్లే ప్రధాన హద్దీ రాస్తా పూర్తిగా ఆక్రమణలతో మూసుకుపోయిన పరిస్థితి నెలకొంది.అలాగే వాగు ప్రాంతం నుండి గుడి వెనకాలుగా వెళ్లే మార్గం కూడా కబ్జాల కాటుకు గురై ప్రజలకు అందకుండా మారింది. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న కీలక హద్దీ రాస్తాలు కూడా ప్రైవేట్ ప్లాట్లుగా మారిపోవడం గమనార్హం.ఇంత తంతు జరుగుతున్న ఈ అక్రమాలపై రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు కళ్లుమూసుకుని ఉండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కోరుట్ల పట్టణంలో ప్రజల రైతుల అవసరాలకు ప్రభుత్వ హద్దీ రాస్తాలు కబ్జాదారుల బారిన పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సాయిబాబా గుడి ముందు నుండి వెంకటాపూర్ వైపు వెళ్లే ప్రధాన హద్దీ రాస్తా పూర్తిగా ఆక్రమణలతో మూసుకుపోయిన పరిస్థితి ప్రస్తుతం కొత్తగా పుట్టుకొస్తున్న వెంచర్ల లో కూడా ఈ హద్దీ రాస్తాలు కబ్జాలకు కావడం. అలాగే వాగు ప్రాంతం నుండి గుడి వెనకాలుగా వెళ్లే మార్గం కూడా కబ్జాల కాటుకు గురై ప్రజలకు అందకుండా మారింది.కోరుట్ల నుండి మెట్ పల్లి వెళ్లే జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఇరువైపుల గల హద్దీ రాస్తాలు కూడా ప్రైవేట్ ప్లాట్లుగా మారిపోవడం గమనార్హం. ఈ అక్రమాలపై రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కళ్లుమూసుకుని ఉండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అధికారులకు కబ్జాదారులకు ఏమైనా ఒప్పందాలు కుదిరాయి అనే వాదనలు లేకపోలేదు.
కోరుట్ల పట్టణంలో ఒకప్పుడు గ్రామాలను, పంట పొలాలను కలిపిన పాత దారులు, హద్దీరాస్తాలు ఇప్పుడు కనుమరుగవుతున్న దుస్థితి నెలకొంది. తరతరాలుగా ప్రజలు వినియోగిస్తున్న ఈ మార్గాలు క్రమంగా ఆక్రమణలకు గురై మాయమవుతుండటం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రజా అవసరాల కోసం ఉన్న ఈ దారులు నేడు కొంతమంది కబ్జాదారుల స్వార్థ ప్రయోజనాలకు బలవుతున్నాయి.
పాత దారులను, హద్దీరాస్తాలను ఆక్రమించి వాటిపై నిర్మాణాలు చేపట్టడం, ప్లాట్లుగా విభజించడం వంటి చర్యలు బహిరంగంగా జరుగుతున్నా, దీనిపై చర్యలు తీసుకోవాల్సిన తహసీల్దార్, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. ప్రజలు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు కనిపించకపోవడం అధికారుల పనితీరుపై ప్రశ్నార్థకంగా మారింది.
ఈ దారులు లేకుండా పోవడంతో అవసరాల నిమిత్తం ప్రజలు, రైతులు తమ పొలాలకు వెళ్లడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వాహనాలు చేరుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇది కేవలం రాకపోకల సమస్య మాత్రమే కాదు ప్రజల జీవన విధానంపై తీవ్ర ప్రభావం చూపే అంశం.
అధికారుల నిర్లక్ష్యమా… చూసి చూడనట్లు వ్యవహరించడమా
అయితే ఈ పరిస్థితిపై అధికారుల మౌనం అనుమానాలకు తావిస్తోంది. ఇది కేవలం నిర్లక్ష్యమా? లేక అక్రమాలను కళ్లారా చూసీ చూడనట్టుగా వదిలేస్తున్నారా? అనే ప్రశ్నలు ప్రజల్లో వెల్లువెత్తుతున్నాయి. అధికారుల స్పందన లేకపోవడం అక్రమదారులకు ప్రోత్సాహం ఇస్తున్నట్లుగా మారింది.
పట్టణాభివృద్ధి పేరుతో పాత దారులను మాయం చేయడం భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారి తీస్తుంది. ఒకసారి ఈ దారులు పూర్తిగా కనుమరుగైతే, తిరిగి వాటిని పునరుద్ధరించడం చాలా కష్టసాధ్యం. అందుకే ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని సమీక్షించాలి.
కోరుట్లలో హద్దీరాస్తాలపై జరిగిన ఆక్రమణలను వెంటనే గుర్తించి తొలగించాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, పాత దారులను తిరిగి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి.


