వ్యవసాయ అధికారుల పర్యవేక్షణ కరువు
తనికీలు చేయని సేల్స్ టాక్స్ అధికారులు
పర్టీలైజర్, సీడ్స్ దుకాణాలపై పర్యవేక్షణ కరువై… ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి
రణం న్యూస్ కోరుట్ల మార్చి25
(ఎడిటర్..ఆకుల మల్లికార్జున్)
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ మండలం పరిధిలో 100కు పైగా పర్టీలైజర్ షాపులు, సీడ్స్ దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాలపై అటు వ్యవసాయాధికారుల ఇటు సేల్స్ టాక్స్ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా సడలిపోయిందనే విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వ్యవసాయ రంగానికి కీలకమైన ఈ వ్యాపార కేంద్రాల్లో అనేక అక్రమాలు బహిరంగంగానే సాగుతున్నప్పటికీ, సంబంధిత శాఖల నిర్లక్ష్యం కారణంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తనికీలు చేయని సేల్స్ టాక్స్ అధికారులు..భారీగా ప్రభుత్వ ఆదాయానికి గండి
ప్రత్యేకంగా సేల్స్ టాక్స్ అధికారుల తనిఖీలు పూర్తిగా శూన్యంగా మారాయి. దుకాణదారులు బిల్లులు ఇవ్వకుండా అమ్మకాలు జరుపుతూ ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయాన్ని దారి మళ్లిస్తున్నారనే విషయం బహిరంగ రహస్యంగా మారింది. బిల్లు లేకుండా అమ్మకాలు చేయడం ద్వారా పన్ను ఎగవేతకు పాల్పడుతున్నా, అధికారులు కళ్ళు మూసుకుని ఉండటం అనుమానాలకు తావిస్తోంది.
ఇక సేల్స్ టాక్స్ శాఖ పాత్రపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెగ్యులర్ తనిఖీలు జరగకపోవడంతో బిల్లులు లేకుండా జరిగే వ్యాపారం విస్తృతంగా పెరిగింది. అధికారుల అలసత్వం వల్ల ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుండగా, నిజాయితీగా వ్యాపారం చేసే దుకాణదారులు కూడా నష్టపోతున్నారు.
దర్జాగా నకిలీ విధానాలు… ఫస్టిసైడ్స్ అమ్మకాలు…
వ్యవసాయ అధికారుల అండదండలు మెండుగా ఉన్నాయన్న వాదనలు
రైతులు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు పొందాల్సిన సమయంలో నకిలీ లేదా నాణ్యతలేని ఉత్పత్తులు విక్రయించే పరిస్థితులు మనకు అంతటాకనిపిస్తూనే ఉన్నాయి.వ్యవసాయాధికారులు సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు వ్యాపారులు అధిక ధరలకు ఫస్టిసైడ్స్, ఇతరత్రా పురుగుల మందులు బిల్లులు లేకుండా అమ్ముతూ రైతులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో షాప్ యజమానులు దర్జాగా నకిలీ మందుల దందా చేస్తున్నారంటే అధికారులతో కుమ్మక్కు అయ్యారనేది బహిరంగంగానే కనపడే నిజం.దేశానికి వెన్నుముక రైతన్న అంటారు.ఆ రైతన్న నడ్డివిరుస్తున్న షాప్ యజమానులకు అధికారులు సహాయ సహకారాలు అందించడంలో మర్మం అందరికి అర్ధమయ్యే విషయమే..అధికారులే అందినకాడికి దోచుకుండామనుకుంటే ఏదో దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్న సామెత కు అద్దం పట్టినట్లు కనిపిస్తుంది ఈ కోరుట్ల లో ఈ శాఖ అధికారుల తీరు….
రైతుల నుండి తీవ్రమైన వ్యతిరేకత..
ఈ పరిస్థితిపై రైతు సంఘాలు, ప్రజా సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సంబంధిత శాఖలు వెంటనే స్పందించి, పర్టీలైజర్, సీడ్స్ దుకాణాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. బిల్లులు ఇవ్వని వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, నాణ్యత నియంత్రణపై కూడా దృష్టి సారించాలని కోరుతున్నారు.

