ఆక్రమణ దారుల పై ఎలాంటి చర్యలుండవా
కబ్జాకోరుల పేర్లు గోప్యముగా ఉంచడం లో ఆంతర్యం మేంటి
దేవాలయ భూమి కబ్జా కాకుండా చూస్తాం… జువ్వాడి నర్సింగరావు కృష్ణారావు
వెంకన్న భూముల కాపాడాలంటూ… మంత్రి అడ్లూరి లక్ష్మన్ కు వినతిపత్రం ఇచ్చిన. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
- గతంలో మాజీ కౌన్సిలర్ పెండెం గణేష్ పిర్యాదు తో హద్దులు పాతిన అధికారులు
రణం న్యూస్ డెస్క్: మార్చి14
(ఎడిటర్…ఆకుల మల్లికార్జున్)
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చెందిన విలువైన భూములపై ఆక్రమణల వ్యవహారం రోజురోజుకు వివాదాస్పదంగా మారుతోంది. దేవాలయ ఆస్తుల రక్షణపై రాజకీయ నాయకులు స్పందించినప్పటికీ, అసలు ఆక్రమణలకు పాల్పడిన వారు ఎవరు అనే ప్రశ్న మాత్రం ఇప్పటికీ సమాధానం లేకుండా మిగిలిపోయింది ఇప్పటికే చాలా ఆక్రమణలు జరిగి నిర్మాణాలు కూడా జరిగాయి.
దేవాలయాలకు చెందిన భూములను ఆక్రమిస్తున్న వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల పలు ప్రాంతాల్లో ఆలయ భూములపై అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ ఆస్తులను రక్షించేందుకు అధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దేవాలయ భూములు ప్రజల ఆస్తిగా భావించి వాటిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటున్నారు. ఆక్రమణదారులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అక్రమ నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని సూచిస్తున్నారు. ఆలయ భూముల రక్షణ కోసం ప్రత్యేకంగా పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
కబ్జా చేసిన వారు ఎంతటి వారినైనా ఉపేక్షించం..
కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు

దేవాలయ భూముల పరిరక్షణలో తాము ఎప్పుడూ ముందుండి పోరాడినట్లు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు పేర్కొన్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు జువ్వాడి కృష్ణారావు తెలిపారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ఆలయ ఆస్తులను కాపాడడం తమ కుటుంబం బాధ్యతగా భావించిందని తెలిపారు. గతంలో అనేక ప్రాంతాల్లో దేవాలయ భూములపై జరిగిన ఆక్రమణలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ప్రజల సహకారంతో ఆలయ భూములను రక్షించే ప్రయత్నాలు కొనసాగించామని పేర్కొన్నారు. దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలే కాకుండా ప్రజల విశ్వాసానికి ప్రతీకలని అన్నారు. వాటి ఆస్తులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఆలయ భూములపై ఎలాంటి అక్రమాలు జరిగినా తాము మౌనంగా ఉండబోమని హెచ్చరించారు. ఈ మధ్య ఆక్రమణకు చేసి దారిగా మార్చితే హద్దులు పాతి భూమిని దునించ్చామని గుర్తుకు చేశారు. అవసరమైతే ఆలయ భూముల రక్షణకు మా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటదని తెలిపారు.
దేవాలయ భూములను రక్షించాలంటూ మంత్రి అడ్లూరి వినతి…. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్

కోరుట్లలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చెందిన భూముల ఆక్రమణల అంశంపై ప్రతిపక్షంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తెలంగాణ మంత్రి జిల్లా మంత్రి అయిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు. దేవాలయానికి చెందిన విలువైన భూములపై జరుగుతున్న అక్రమ ఆక్రమణలను తక్షణమే నిలిపివేయాలని ఆయన కోరారు.దేవాలయ ఆస్తులపై పూర్తి స్థాయి సర్వే నిర్వహించి అసలు పరిస్థితులను వెలుగులోకి తేవాలని, ఆక్రమణలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. దేవాలయ భూములు భక్తుల విశ్వాసానికి ప్రతీకలని, వాటిని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
ఈ అంశంపై అధికారులు త్వరితగతిన స్పందించి దేవాలయ భూములను రక్షించే చర్యలు తీసుకోవాలని స్థానికులు కూడా కోరుతున్నారు.
గతంలో తాజా మాజీ పెండెం గణేష్ పిర్యాదు తో హద్దులు పాతిన అధికారులు

దేవాలయానికి చెందిన భూములపై జరుగుతున్న నిర్మాణాలపై గత మున్సిపల్ పాలకవర్గం కాలంలో వివాదం చెలరేగింది. ఆ సమయంలో బీజేపీ తాజా మాజీ కౌన్సిలర్ పెండెం గణేష్ చేసిన ఫిర్యాదు నేపథ్యంలో అధికారులు స్పందించి నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేశారు.
దేవాలయానికి చెందిన భూములపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై అప్పటి అధికారులు స్థలాన్ని పరిశీలించారు. అనంతరం దేవాలయ భూముల పరిమితులను గుర్తిస్తూ హద్దులు పాతి స్పష్టత తీసుకొచ్చారు. భూములపై మరిన్ని ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు అప్పట్లో తెలిపారు.
అయితే ప్రస్తుతం మరోసారి దేవాలయ భూముల ఆక్రమణల అంశం చర్చకు రావడంతో గతంలో జరిగిన పరిణామాలు మళ్లీ ప్రస్తావనకు వస్తున్నాయి. అధికారులు తీసుకున్న చర్యల తర్వాత కూడా ఆక్రమణలు కొనసాగుతున్నాయా అనే అంశంపై స్థానికుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఆక్రమణ దారుల పేర్లు గోప్యన్గా ఉంచదానికి కారణాలేంటి…
అయితే ఈ వ్యవహారంలో అసలు ఆక్రమణదారులు ఎవరు అనే విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. భూదందా వర్గాలు దేవాలయ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నప్పటికీ అధికారికంగా వారి పేర్లు వెల్లడించబడలేదు.
స్థానిక ప్రజలు మాత్రం దేవాలయ భూముల విషయంలో నిజాలు వెలుగులోకి రావాలని కోరుతున్నారు. ఆక్రమణలకు పాల్పడిన వారెవరు, వారికి అండగా నిలుస్తున్నవారు ఎవరు అనే విషయాలను బయటపెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
దేవాలయ భూముల ఆక్రమణలపై రాజకీయ నాయకులు స్పందించినా, అసలు కబ్జాదారుల పేర్లు బయటపడకపోవడం కోరుట్లలో చర్చనీయాంశంగా మారింది. అధికారులు పూర్తి స్థాయి విచారణ జరిపి నిజాలను బయటపెడతారా లేదా అన్నది ఇప్పుడు ప్రజల్లో ఆసక్తిగా మారింది.
అధికారుల అలసత్వం…. కబ్జాకోరుల పై చర్యలు శూన్యం….
దేవాలయాలకు చెందిన భూములపై ఆక్రమణలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ భూములపై అక్రమ నిర్మాణాలు, కంచెలు వేయడం వంటి ఘటనలు పెరుగుతున్నా అటువంటి వారిపై వారి పై ఎలాంటి అడ్డుకునే చర్యలు కనిపించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. దీంతో ఆక్రమణదారులు మరింత ధైర్యంగా ముందుకు వస్తున్నారని చెబుతున్నారు కబ్జా కోరులపై చర్యలు తీసుకోకపోవడం.. కేసులు పెట్టకపోవడం.. కనీసం నోటీస్ లు కూడా పంపకపోవడం అధికారుల నిర్లక్షణానికి కారణమా… అందినకాడికి అందిపుచ్చుకుందాం అనే ధోరణా అర్థం కావడం లేదు…వాటిని అడ్డుకునే చర్యలు కనిపించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు.

