ఒక…కాకి అధికారి ఔదార్యం…
సర్పంచ్ ఎన్నికల సిబ్బందికి చేదోడుగా నిలిచిన వైనం…
రణం న్యూస్ కోరుట్ల: డిసెంబర్11

సేవ చేయాలన్న దృక్పథం ఉంటే… చేసే పనినే దైవంగా భావించవచ్చు…తను చేరాల్సిన గమ్యం చేరుకోకపోయిన తోటి వారిని గమ్యం చేర్చగలుగుతారు.. కానీ వారిని ఒక సీసీఎస్ లో పనిచేస్తున్న ఒక సబ్ ఇన్స్పెక్టర్ వందమందికి పైగా ఉద్యోగులను వారి గమ్యస్థానికి చేర్చారు..వివరాల్లోకి వెళితే మొదటి విడత ఎలెక్షన్ డ్యూటీకి జగిత్యాల జిల్లా కోరుట్లకు వచ్చిన సిబ్బంది ఇక్కట్లు పడుతుంటే…డ్యూటీకి చేరుకున్నాక అన్ని వసతులు కల్పించారు కానీ.. ఎన్నికల ప్రక్రియ ముగిశాక ఈ సిబ్బంది బాధలు పట్టించుకొనేవారేలేరూ…. మహిళ ఉద్యోగులు… విడి నిర్వహణకు వచ్చిన సిబ్బంది తమ తమ గ్రామాలకు వెళ్లాల్సిన వారు రవాన్ సౌకర్యం లేక నానా యాతనలు పడ్డారు..కానీ ఈ కాకి ఉద్యోగి సీసీఎస్ ఎస్ ఐ రవీందర్ వచ్చిపోయే వాహనాలు ఆపుతూ వందకు పైగా ఉద్యోగులను గమ్యస్థానం చేర్చడానికి ప్రయత్నించారు..ఇతని సేవలు భేష్ అని ఎన్నికల విది నిర్వహణకు వచ్చిన ఉద్యోగులు కొనియాడారు.బందోబస్తు డ్యూటీ యే కాదు గమ్యస్థానం చేర్చే బాధ్యతలు తీసుకున్న ఈ ఎస్ ఐ రవీందర్ గారిని పలువు అభినందించారు…

