ప్రభుత్వానికి అప్పులు… మిల్లర్ల జల్సాలు….
మిల్లు మీద మిల్లులు కోట్లకు కోట్ల బకాయిలు…
విజిలెన్స్ సోదాలు సరే… చర్యలేవి……
రెవెన్యూ రికవరీ యాక్ట్ నామ మాత్రమేనా…
రణం న్యూస్ కోరుట్ల: డిసెంబర్ 2
చిన్న చితక అప్పులు చేస్తే ఇంటిముందుకొచ్చి కదలని బ్యాంక్ అధికారులను చూసాం… రైతులు అప్పుచేస్తే ఇంటి ధర్వాజలు పీక్కపోయిన సందర్భాలు చూసాం… అప్పుల బాధలు తాళలేక రైతుల సామాన్యుల ఆత్మహత్యలు చూసాం.. కానీ కోట్ల కోట్లు ప్రభుత్వానికి బకాయిలు ఉండి… ఆ డబ్బుతో ఎకరాల కొద్దీ స్థలాలు….కోరుట్ల నుండి మొదలు కొని జాతీయ రహదారులకు ఆనుకొని హైదరాబాద్ కు వెళ్లే అన్ని మార్గాల్లో వందల ఎకరాల జాగాలు,ఫంక్షన్ హాల్ లు,ఫార్మ్ హౌస్ లు విలాసవంతమైన వాహనాలు సమకూర్చుకుని జల్సాలు చేస్తున్నారు కొందరు రైస్ మిల్లర్ మాఫియా…గతంలో ఉన్న ఆస్తులకు ఇప్పుడు సమకురిన ఆస్తులకు ఆదాయ వనరులుగా రైస్ మిల్ దందా దారులను చూస్తే తెలుస్తుంది.ఒక మిల్లుతో మొదలు పెట్టి మిల్లు మీద మిల్లులు కడుతూ ప్రభుత్వానికి పంగణామాలు పెడుతున్నారు.ఆ కోవలోకే వచ్చే కొందరు ఉన్నారు.. ప్రొద్దున లేస్తే అప్పులు వాళ్ళు వస్తారని చుక్కపొద్దు పొడవక ముందు వెళ్ళేటోడు అనతి కాలంలోనే నేడు కోట్లకు పడగలెత్తారు. ఇంకొందరు తాతల కాలం లో ఉన్న ఒక మిల్లు పది మిల్లులుగా విస్తరించి వందకోట్ల బకాయిలున్న దర్జాగ తిరుగుతున్నాడు.సామాన్యుల పై విరుచుకుపడే ప్రభుత్వాలు ఇలాంటి పందికొక్కులను దూరం పెట్టి రావాల్సిన సొమ్మును నిర్దాక్షిణ్యంగా వసూల్ చేయాలని పలువురు త అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రైతుల నుంచి ధాన్యం కొనేందుకు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి మరీ వడ్డీలు కడుతూ పౌర సరఫరాల సంస్థ నష్టాలను చవిచూస్తుంటే, కొందరు మిల్లర్లు ఆ వడ్లతో వ్యాపారం చేస్తూ లాభాలను గడిస్తున్నారు. ఇలా రూ.కోట్లలో గడిస్తున్నట్లు సమాచారం. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు పంపి కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) ఇవ్వమంటే, కొందరు ఆ బియ్యాన్ని నౌకాశ్రయాలు, అక్కడి నుంచి విదేశాలకు తరలిస్తూ రూ.కోట్లు దండుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా 2022-23 రబీ సీజన్‌కు సంబంధించి లక్షల క్వింటాళ్ల ధాన్యం కనిపించకుండా పోగా, దీని విలువ సుమారు వేల కోట్లకు పైమాటే ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

తనికీలు సరే చర్యలేవి…
మిల్లులకు కేటాయించిన ధాన్యం ఉందా లేదా అనే విషయమై స్థానిక యంత్రాంగం ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి చర్యలకు సిఫార్సు చేయాల్సి ఉంది. కానీ ఒక్కో మిల్లులో వేలు, లక్షల క్వింటాళ్ల ధాన్యం దారి మళ్లుతుంటే స్థానిక అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. రైస్ మిల్లుల్లో 2022-23 ఆర్థిక సంవత్సరానికి 384 మిల్లులపై రెండువేల కోట్ల బకాయిలు ఉంటే… రాష్ట్రం లో ఉన్న అన్ని మిల్లులను పరిశీలిస్తే ఎన్ని వేల కోట్ల అక్రమాలు వెలుగుచూస్తాయో తెలియాల్సి ఉంది..పూర్తిస్థాయి విచారణ, చర్యలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి..ఇక్కడ ఒక దగ్గరే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కొన్ని మిల్లింగ్‌లలో ఈ సమస్య పై అధికారులు తనిఖీలు విస్తృతం చేయాలని ప్రజలు కోరుతున్నారు
రెవెన్యూ రికవరీ ఆక్ట్ నామ మాత్రమేనా..
అధికారులు వాతాదారులేనా…
రెవెన్యూ రికవరీ ఆక్ట్ నుండి తప్పించుకొనేందుకు అడ్డదారులు తొక్కుతున్న మిల్లర్లపై అధికారులు తూ తూ మంత్రంగా కేసులు నమోదు చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత వెనువెంటే చర్యలు లేకపోవడం మిల్లర్లకు కలిసివస్తున్నది. కొన్నిసార్లు విచారణ ఆలస్యంగా జరుగుతుండగా, రెవెన్యూ రికవరీ చట్టానికి దొరక్కుండా ఉండేందుకు అడ్డదారులు తొక్కేందుకు సివిల్ సప్లై అధికారులే సహకారం మెండుగా ఉందనే విమర్శలున్నాయి. ఈ క్రమంలో నిందితులు తమ పేరు మీద ఉన్న ఆస్తులను జప్తు చేయకుండా ఉండేందుకు గుట్టుగా బినామిల పేరు మీదకు మారుస్తున్నారు అనే ఆరోపణలు లేకపోలేవు. జగిత్యాల జిల్లాలో జిల్లాలో ఏ ఒక్క రైస్ మిల్లర్‌పై రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించేందుకు ప్రయత్నించకపోగా, అధికారులే ముందుగా ఆయన పేరు మీద ఉన్న ఆస్తులన్నీ కుటుంబ సభ్యుల పేరుపైకి మార్చుకోమని సలహా ఇచ్చినట్లు తెలియవస్తుంది.. ఈ రికవరీ సాధ్యపడకపోగా అధికారుల కనుసన్నల్లోనే ఈ ధాన్యం దోపిడీ జరుగుతుందనే విషయం తెలియవస్తుంది..

కోరుట్ల డివిజన్ లో బడాబాబుల ముసుగులో బియ్యం దొంగలు
ఈ మిల్లర్ల పై అధికారులకు అంత ప్రేమేందుకో….
జగిత్యాల జిల్లాలో కోరుట్ల డివిజన్ లో బియ్యం దొంగలైన మిల్లర్ల పై చర్యలు లేకపోవడంతో కొందరు చిన్న చితక రియల్ వ్యాపారులు బ్యాంకు అధికారులతో సత్సంబంధాలు చోట మోటా ప్రజా ప్రతినిధులుగా చలామణి అయ్యే ఆయాకులుఈ ఎండకు ఆ గొడుగు పడుతూ..ఇరవై ఐదు కోట్లకు పైగా,మిల్లర్ అసోసియేషన్ నాయకుడిగా చలామణి అయ్యే నాయకుడు నలబై కోట్లకు ఫైగా బకాయిలు అక్రమాలకు తెరలేపి, ప్రభుత్వం ఇచ్చిన వడ్లకే ఎసరు పెట్టి కోట్లు దండుకున్నట్లు విజిలెన్స్ ఆదికారుల దాడుల్లో తేలింది. బియ్యం కంటే ధాన్యం అమ్మితేనే ఎక్కువ అక్రమార్జన వస్తుందని భావించి ఇతర జిల్లాలు, రాష్ర్టాలకు అక్రమంగా ధాన్యాన్ని తరలించి విక్రయించినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే పలుచోట్ల రూ.కోట్ల విలువైన ధాన్యాన్ని అమ్ముకున్నట్లు అధికారుల తనిఖీల్లో బహిర్గతమైంది.అయినా ఎలాంటి చర్యలు లేక అధికారులను సైతం మెప్పించే స్థాయికి ఈ మాఫియా ఎదిగింది అనడంలో అతిశయోక్తిలేదు.. ఆ మధ్య ఒక ప్రొఫెసర్ అన్నట్లు… కొందరు సామాజిక స్మగ్లర్ల లో ముక్యుడు ఈ మిల్లర్ మాఫియానే శాసిస్తుండటం గమనార్హం.
