మేము ఏ అధికారి చెప్పిన వినం.. జులుం…
తప్పుడు పత్రాలతో నా స్థలాన్ని కబ్జాజేశారు..
అధికారులకు విన్నవించైనా లాభం లేదు అంటున్న బాధితుడు అజీమ్
రణం న్యూస్ కోరుట్ల:నవంబర్ 22
మేము ఏ అధికారి చెప్పినా వినం… మమ్మల్ని ఎవరు ఎం చేయలేరు.. కుంటలు కూడిపేస్తాం… కాలువలు మూసేస్తాము… మమ్మల్ని ఎవరూ ఎం చేయలేరు…* *మాకు కన్వర్షన్ తో పనిలేదు రోడ్లన్నీ మింగేస్తాం కన్వర్షన్ లేకుండానే ప్లాటెషన్ చేస్తాం మమ్మల్ని ఆపేవారు లేరని కేటుగాళ్లు ఫోర్జరీ పత్రాలతో నా స్థలమును కబ్జాచేశారని బాధితుడు అజీమ్ ఆరోపించారు*.

వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరు గ్రామంలో వెలిసిన ప్రెస్టీజ్ పార్క్ పేరిట అక్రమ వెంచర్లో ఎలాంటి డిటిసిపి అప్రూవల్ లేకుండా ఇష్టారీతిన నిర్మాణాలు చేస్తున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని నా యొక్క వ్యవసాయ భూమిని ఎలాంటి పత్రాలు లేకుండా ఒక్కొక్క ప్లాట్ గా రిజిస్ట్రేషన్ చేస్తూ నిర్మాణాలు చేస్తున్నారని అజీమ్ ఆరోపించారు.నాలా కన్వర్షన్ లో లొసుగులను ఆసరాగా చేసుకుని స్థానిక రిజిస్టర్ లతో మచ్చిక చేసుకుని రిజిస్ట్రేషన్ లు చూపిస్తున్నారన్నారు.ఈ సర్వేనెంబర్ 472,473,474,455 పెట్టి ఫ్లాటింగ్ చేసి అమ్మకాలు చేస్తున్నారని.ఎన్నో ఏళ్లుగా ఉన్న మెడికుంట ను ఆనవాళ్లు లేకుండా చేసి అసలు ఆ కుంటనే లేదంటూ గ్రామస్థులనే దబాయిస్తున్నారన్నారు. ఇంత తతంగం జరిగిన కాలువలు కుంటలు ఎలా ఇరిగేషన్ శాఖవారు
ఎన్వోసి ఇచ్చారు అని ఆయన సందేహం వ్యక్తం వ్యక్థ పరిచారు.మరో పక్క ఫోర్జరీ లు చేసి దొంగ క్లీయరెన్సు సృష్టించారనే అనుమానాలు వ్యక్తముతున్నాయని ఆయన ఆరోపించారు. ఇరిగేషన్ కాలువను సైతం మింగేసి నామ్స్ ప్రకారం వెంచర్ని ఫామ్ చేయకుండా అక్రమ హౌస్ పర్మిషన్స్ సృష్టించి ఇంటీ నిర్మాణాలు చేస్తూ నాకు సంబంధించిన స్థలాన్ని కబ్జా చేసి ఆ స్థలంలో ప్లాటులు వేశారు.కోర్టులో కేసు వేశానని ఇక్కడ నిర్మాణాలు చేస్తు అమాయక ప్రజలకు అంటగట్టి మోసగిస్తున్నారని ఆరోపించారు.ఇదంతా ఇలా ఉండగా కలెక్టర్ కు పిర్యాదు చేయగా విచారణకు అదేశించారని విచారణ పూర్తయ్యేవరకు నిర్మాణాలు ఆపాలని అధికారులు ఆదేశించిన ఈ రియటర్లు నిర్మాణాలు ఆపలేదని బాధితుడు ఆరోపించారు.అధికారులు నామ మాత్రంగా వ్యవహరించారని అజీమ్ అసహనం వ్యక్త చేశారు.నాకు న్యాయం జరిగేవరకు పోరాడుతానని ఆయన అన్నారు.

