ఎందుకీ బంధు…రణం వార్త దినపత్రిక ఒక సూటి ప్రశ్న…
రణం న్యూస్ ఎడిటర్ : ఆకుల మల్లికార్జున్

ఈ పోరాటం ఎవరికోసం… ఈ పోరాటం కు అడ్డు పడుతున్నది ఎవరు..పోరాటంలో భాగస్వాములు ఎవరు.. ఒక బిసి బిడ్డగా అడుగుతున్న.. బిసి నాయకుల పేరిట ఎన్నాళ్లీ దోపిడీ.. ఎన్నాళ్లీ దగా…
తెలంగాణ బంధు కు గల కారణాలు ఏంటి…? తెలంగాణ బంద్ కి మద్దతు తెల్పినవారు ఎవరు..? అన్ని పార్టీ లు ఈ బంధు కు పిలుపునిచ్చాయి..కదా?..
అటు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ… ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ…కార్మికకర్షక జీవుల పక్షాన ఉన్న వామపక్షపార్టీలు…ఇటు తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం పోషిస్తున్న భారత రాష్ట్ర సమితి..ఇలా చెప్పుకుంటు పోతే అన్ని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని బిసి సంఘాలు బంధులు చేశాయి..అన్ని పార్టీలు అన్ని బిసి సంఘాలు బంద్ ప్రకటించినపుడు ఈ సమస్య ఎక్కడి నుండి వచ్చింది.. ఒక్క వ్యక్తి వేసిన కేసు మీద కేంద్ర రాష్ట్ర రాజకీయాలు ప్రభావితం అవుతున్నాయా.. బిసిల ఓట్లకు గాళం వేసే ప్రవత్నాలు జరుగుతున్నాయా… తేల్చుకోవావాల్సిన సమయ ఆసన్నమైంది.. ఈ బంధు లో ఆధిపత్య పొరుకోకోసం దాడులు… ప్రతిదాడులు జరిగిన సంఘటనలు చూసాం.. ఇంకా చాలా చూస్తాం…
అటు అగ్ర వర్ణాల పెరుతో చైతన్యవంతులైన వారు ఉన్నారు.. ఇటు అణగారిన వర్గాలంటూ వీరు చైతన్య వంధులే…
ఈ రాజకీయ క్రినీడ పోరాటంలో ఆఖరికి బలి అవ్వాల్సిసింది బడుగు బలహీన వర్గాలేనా బీసీలేనా
