గతనెలలో “”రణం”” వార్త కథనంతో ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న బాధితులు…
విందులతో అమాయకులకు గాళం…
ప్రముఖులకు విదేశీ టూర్లు… అమ్మాయిలతో మసాజ్ లు…
ఏది కోరుకుంటే అదేనట…
మన్నెగూడెం “”కటుకం మురళి”””” ఈ దందాలకు సూత్రధారి అంటున్న బాధితుడు….
రణం న్యూస్ కోరుట్ల: అక్టోబర్ 6
వీరికిఅమాయకులే…ఉద్యోగులు,వ్యాపారులు,,గృహిణులు… టార్గెట్…నమ్మించి మోసం చేయటం వెన్నతో పెట్టిన విద్య.. పాపం దయ గోస అనే ఎలాంటి పాప భీతి ఉండదు..క్యూనెట్ అనే వ్యాపారంతో కోట్లు కొల్లగొటారు…ఇపుడు క్రిప్టో బిట్ కాయిన్ పేరుతో అనేక కుటుంబాలు రోడ్డున పడేలా చేసారు….మ్యాజిక్ మాదిరే ఉంటుంది….పైసా కంటికి కనిపించవు కానీ…కాసులు కురిపిస్తాయి. డబ్బులు ఉన్నట్లే అనిపిస్తాయి కానీ ఉండవు. చేత్తో తాకలేము, పర్సులో పెట్టుకోలేము. ఒక్క కాయిన్ సంపాదిస్తే, సాధిస్తే లైఫ్ సెటిల్..అంతే.. అని కన్ఫ్యూజింగ్ చేస్తూ పెట్టుబడులు పెట్టించే దందా ఇదే… దీని వెనుక జరుగుతున్న అసలు మోసాలు మెల్లగా మెల్లగా బట్టబయలు అవుతున్నాయి.
గత నెలలో “రణం” దినపత్రికలో వచ్చిన కథనంతో బాధితులు ఒకొక్కరు బయటకు వస్తున్నారు.ఈ దందా సూత్రధారి తనపెరిట ఉన్న ఆస్థులన్ని తన బినామీపేర్లపైకి మార్చాడని,నిత్యం ఐదువారాల నగలతో తిరిగే అతని బార్యకుడా సింపుల్ తయారవుతుందని,ఇంటిని తాకట్టు పెట్టాడని,ఇంకో వ్యక్తి కోటి రూపాయల చిట్టి ని కపిల్ చిట్ ఫండ్ నుండి ఎత్తాడని,బాధితులు రహస్యంగా లీక్స్ ఇస్తున్నారు.
ఎక్కడ చూస్తే అక్కడ గుంపులుగా ఉండే గూడెం గుంపు చూద్దామంటే కనపడకుండా పోయిందని పలువురు గుస గుసలాడుతున్నారు.ఈ దందా సూత్రదారి మనిగూడెం వాసి ఎక్కడ కనిపించడం లేదని పరార్ అయ్యే ఆలోచనలో ఉన్నాడని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

యాటలు కోస్తూ..విందులు ఇస్తూ… అమాయకులను గాళం వేస్తూ….
పెట్టుబడి దారులను ఆకర్షించాలంటే మొక్కులు చేసుకుంటాను అంటూ పుణ్యక్షేత్రాలలో యాటలు కోసి ఖరీదైన మందు ఏర్పాటు చేసి రెండు బస్సులు పెట్టి,పది పన్నెండు కార్లు రెండు మూడు వందల మందికి పెద్ద ఎత్తున దావత్ ఏర్పాటు చేసి తన ప్రాబావాన్ని చూపుతూ అమాయకులకి వల వేయడంలో ఒకరకమైన టెక్నిక్ ఉపయోగించడం,ఈ తరహాలో పక్కా జిల్లాలో పలు సార్లు పార్టీ లు,రాయికల్ మండలంలో ఒక తోటలో జిల్లా లోని వందల మందికి,మన్నెగూడెం లో కడెం ప్రాజెక్టులో విందులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి…ఈ విందులతో పాటు ఎన్నో రకాల జల్సాలు కూడా చేయిస్తున్నట్లు బహిరంగంగా జరుగుతున్న చర్చనే.
ప్రముఖులకు విదేశాల్లో మసాజ్ లు… జల్సాలు…ఫైవ్ స్టార్ హోటల్ లలో బస…

ఈ దందాలో ఏమైనా ఆటంకాలు వస్తే అధికారులనుండి ఒత్తిడి రాకుండా వారిని ప్రసన్నం చేసుకోవడానికి మధ్యవర్తిత్వం చేసే కొందరు ప్రముఖులకు బ్యాంకాక్,థాయిలాండ్, సింగపూర్,ఫిలిప్పీన్,వంటి దేశాలకు ఉచిత త్రిప్పులు… స్టార్ హోటల్ లలో బస….అమ్మాయిలతో మసాజ్ లు… ఖరీదైన మందు అడ్డు అడుపులేని జల్సాలు…. ఏర్పాటు చేయడం…. ఈ దందా సూత్రధారికి మొదటి పెట్టుబడి పెట్టి కోరుట్లలో స్థిరపడిన ఒక ఎడారి దేశం లో పని చేసి వచ్చినా క్రిప్టో వ్యాపారి కొంత మంది ప్రముఖులను ఈ విదేశీటూర్ లకు తిప్పుకొచ్చాడాని,ఈ టూర్ కు ఇలాంటి పనుల్లో దిట్ట అని గతంలో లీడర్లను పైసా ఉన్నవాళ్లను ఇలాంటి పార్టీ ల ఎర చూపినా వ్యక్తే మధ్యవర్తిత్వం వహించాడని ఆయన సహచరుడే చెప్పుకు రావడం గమనించాల్సిన విషయం. ప్రముఖులు అధికారులు కూడా వీరి పక్షం చేరేసరికి అసలు వాళ్లే మా వైపు ఉన్నారు ఎవరు ఎం చేయలేరు అంటుకుంటు అమాయకుల ను ముంచుతూ… అందరిని గ్రిప్పులో పెట్టుకున్నారు.ఒక్కొక్కరికి ఒక్కొక్కవిదంగా కమ్మేస్తూ తమ పబ్బం గడుపుకొంటున్నారు.
మచ్చుకు కొందరు బాధితులు…
ఈ మోసపూరిత క్రిప్టో బిట్‌కాయిన్ దందాలో అమాయకులే ఎక్కువ బలైతున్నారు.మేడిపల్లి మండలంలో ఒక గ్రామంలో భర్తలేని మహిళ ను మాయమాటలు చెప్పి నాలుగు లక్షల ఇరువది ఐదువేల రూపాయాలు ఈ దందాలో పెట్టుబడి పెట్టించి మొఖం చాటేస్తున్నారు, ఇదే మండలంలో గల్ఫ్ హారామ్ కో కంపెనీలో పనిచేసిన ఒక వ్యక్తి రెండుకోట్ల రూపాయలు పెట్టి,చాలామందిని ఈ దందాలో చేర్పించినట్లు, నేను పెట్టిన పదిలక్షల రూపాయలు నాకు ఇవ్వకుంటే అందరి సంగతి చెప్తా అంటూ గ్రూప్ లో వాయిస్ మెసీజ్ వైరల్ గా మారడం ఒక్కొక్క బాధితుడు నా పేరు బయటకు రావొద్దంటు “రణం” పత్రిక ను సంప్రదిస్తూ వారూ మోసపోయిన తీరును తెలుపు తున్నారు.అదేవిధంగా కోరుట్ల లో పదిమందికి న్యాయం చేసే వ్యవస్తలో ఉంది పది లక్షల రూపాయలకు పైగా పెట్టుబడి తో ఒక్కరూపాయి రాక ఒక బాండ్ పేపర్ రాసివ్వగానే కక్కలేక మింగలేక ఉన్నట్లు, పట్టణంలోలో మీ సేవా నిర్వహించే వ్యక్తి ఇరవై లక్షలకు పైగా,ఒక గ్లాస్వెయిర్ షాప్ నడిపే వ్యక్తి,బోర్ వెల్ వ్యాపారం చేసే వ్యక్తి ,ఇలా చెప్పుకుంటూ పోతే చిన్న చితక నుండి మొదలుకొని చాలా మంది అంటే వందల మంది ఈ దందాలో డబ్బులు పెట్టి సతమతమవుతున్నారు.ఒక్క మేడిపల్లి మండలం మన్నే గూడెం గ్రామంలోనే పన్నెండు కోట్ల కు పైగా క్రిప్టో బిట్ కాయిన్ లో పెట్టారంటే ఎంతమంది బాధితులోండొచ్చో ఆలోచించాల్సిన అవసరం లేదు.
కటుకం రవి@మణికంఠ… కటుకం మురళి పెద్ద మోసగాళ్ళు…
వీరిని నమ్మి మోసపోవద్దు…….
బాధితుడు గౌరీ గజానందం..

డబ్బు సంపాదించడానికి బంధువులను చూడటం లేదు,అమాయకులను చూడటం లేదని మేడిపల్లి మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన గౌరీ గజానందం తనబాధను వెళ్లగక్కారు.గతంలో క్యూనెట్ అనే చైన్ సిస్టం వ్యాపారం లో కటుకం రవి అలియాస్ మణికంఠ అనే తన దగ్గరి బందువే పదకొండు లక్షలు ముంచాడని,ఇలాంటి మోసపూరిత ఆన్లైన్ దందాలు కటుకం మురళి అనే వ్యక్తి ద్వారానే జగిత్యాల జిల్లాలో ఈ ఏరియాలో నడుస్తున్నాయని, “క్యూనెట్” అనే ఆన్లైన్ వ్యాపారంతో చాలా మందిని ముంచి గతంలో కొన్ని నెలలు కనపడకుండా పారి పోయాడని,ఇపుడు “”బిట్ కాయిన్,క్రిప్టో కరెన్సీ” పేరుతో కొత్త దందా ను తీసుకొచ్చి,చాలా కుటుంబాలను రోడ్లపాలు చేస్తున్నాడని, “కటుకం మురళి” పై అధికారులు చర్యలు తీసుకోవాలని,అదేవిదంగా గతంలో నాతో పాటు చాలా మందిని క్యూనెట్ వ్యాపారం పేరుతో ముంచిన “”కటుకం రవి @మణికంఠ”” పై అధికారులు చర్యలు తీసుకోవాలని లిఖిత పూర్వకంగా కూడా పిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నానని, అమాయకులు వీరి మాటలు నమ్మి నష్టపోవద్దని,వీరి మోసాల బారిన పడకూడదని గజానందం తన బాధను వెళ్లగక్కారు.

