మరో శతాబ్దికోసం పంచ పరివర్ధన్…
రణం న్యూస్ కోరుట్ల: అక్టోబర్04
జగిత్యాల జిల్లా కోరుట్లలో ఘనంగా ఆరెస్సెస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా కాలేజ్ గ్రౌండ్ దుర్గామాత దేవాలయం నుండి పురవీధులగుండా భారీ ఎత్తున స్వయం సేవకులు పద సంచాలన్ చేశారు.వేల మంది స్వయం సేవకులు పాల్గొన్నారు.

అసలు ఆరెస్సెస్ ముఖ్యఉద్దేశ్యాలు స్థాపనకు కారణాలు లక్ష్యాలు ఈ విధంగా ఉన్నాయి
భారత్ దేశంలో జరుగుతున్న వివక్ష,వ్యక్తుల్లో ఆత్మన్యూనత భావం కులాలుగా విభజించబడి తమలో తాము గొడవలు పడుతున్న సమయంలో డాక్టర్ హెగ్డేవార్ ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ను స్థాపించారు.సాంఘీక అసమానతలు రూపుమాపేందుకు, ఒకే దేశం ఒకే ప్రజా మేము భారతీయులం,మా దేశం మా ధర్మం అంటూ దేశసేవకు కంకన బద్ధులుగా తయారు చేయటమే లక్ష్యంగా అవతరింపజేశారు. వంద సంవత్సరాలు అనగా శతాబ్ద కాలపు ప్రయాణంలో సమాజంలోని వివిధ వర్గాల్లో చైతన్యం, ఆత్మవిశ్వాసం ఈ ఆరెస్సెస్ (సంఘ్) జాగృతం చేసింది.కొన్ని దశాబ్దాల కాలంగా గిరిజన వర్గాల సంప్రదాయాలు, ఆచారాలు, విలువలను పరిరక్షించి, పెంపొందించడానికి అంకితభావంతో పనిచేస్తువచ్చింది. ప్రస్తుతం సేవా భారతి, విద్యా భారతి, ఏకలవ్య విద్యాలయాలు, వనవాసీ కల్యాణ్ ఆశ్రమ్ వంటి సంస్థలు గిరిజన వర్గాల సాధికారతకు సంఘ్ మూలస్తంభముగా ఉంటూ అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలు హిందూ సమాజాన్నీ పీడిస్తున్న అందరిని ఏకథాటి పైకి తీసుకురావడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తూ వచ్చింది.
డాక్టర్ హెడ్గేవార్జి కాలం నుంచి నేటి వరకు.. ప్రతీ స్వయం సేవక్, ప్రతీ సర్ సంఘ్ చాలక్ ఈ వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. “అంట రానితనం తప్పు కాకపోతే, ప్రపంచంలో మరేదీ తప్పు కాదు” అని పూజ్య బాలసాహెబ్ దేవరసీ ప్రకటించారు. ఈ నినాదాన్ని స్వయసేవకులైన రజ్జు భయ్యాజి, సుదర్శన్ జి కూడా ఈ సందేశాన్ని ముందుకు తీసుకెళ్లారు. ‘అందరికీ ఒకే బావి, ఒకే గుడి, ఒకే శ్మశానవాటిక’ ఉండాలంటూ ప్రస్తుత సర్ సంఘ్చెలక్ మోహన్ భాగవతీ ఐక్యత దిశగా స్పష్టంగా పిలుపునిచ్చారు.ఇదిలా ఉండగా మారుతున్న పరిణామాలు సమాజం దృష్టిలో పెట్టుకుని రాబోయే శతాబ్దానికి నాంది పలికారు.
‘పంచ పరివర్తన్’ పెరుతో సంఘ్ నేడు జరుగుతున్న పరిణామాలు ఎదుర్కొనే మార్గాన్ని ప్రతి స్వయం సేవకుడికీ దిశా నిర్ధేశం చేస్తుంది.పంచపరివర్ధన్ ల ముఖ్య ఉద్దేశ్యాలు..

అందులో మొదటిది స్వబోధ: వలసవాద మనస్తత్వం నుంచి విముక్తుల మయ్యేలా, మన వారసత్వ ఘనతను గర్వంగా ప్రకటించు కునేలా, స్వదేశీ సూత్రాన్ని పురోగమింపజేసేలా ఈ ‘స్వీయ అవగాహన’ దోహదపడుతుంది. అణగారిన వర్గాలకు ప్రాధాన్యమిచ్చి అభివృద్ధికి తోడ్పడటం.
రెండోవది స్వీయ అవగాహన’ సామాజిక సామరస్యం: అణగారిన వర్గాలకు ప్రాధాన్యమిచ్చి సామాజిక న్యాయంపై భరోసా కల్పించడం ద్వారా సామాజిక సామరస్యం సాకార మవుతుంది. మన సామాజిక సామరస్యానికి పెనుసవాలుగా పరిణమించిన చొరబాట్ల సమస్యను పరిష్కరించడం కోసం ఉన్నత స్థాయి జనాభా మిషన్ (హై పవర్డ్ డెమోగ్రఫీ మిషన్)ను ప్రభుత్వం ప్రకటించింది.
మూడవది కుటుంబ ప్రబోధన్: మన సంస్కృతికి పునాది అయిన కుటుంబ వ్యవస్థను కుటుంబ విలువలు బలోపేతం చేస్తాయి.
నాలుగోవది. నాగరిక్ శిష్టాచార్: సామా జిక స్పృహ, బాధ్యతా భావం ప్రతి పౌరుడి లోనూ జాగృతం కావాలి.
ఐదోవది పర్యావరణ్: రాబోయే తరాల భవిష్యత్తును సురక్షితంగా ఉంచడం కోసం పర్యావరణ సంరక్షణ అత్యంత ముఖ్యమైనది. ఈ ఐదు సంకల్పాల నిర్దేశంలో… తదుపరి శతాబ్ది లోకి ప్రయాణాన్ని ‘సంఘ్’ నేడు ప్రారంభించింది. 2047 నాటికి అభివృద్ధిచెందిన భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యముతో ముందుకు సాగాలని సంఘ్ రాబోవుతరాలకు మార్గదర్శకంగా ఉండబోతుంది.

