శాస్త్రీయ సమాచారం లేదట… సమయాభావమీ కారణం
ముగ్గురు పిల్లలుంటే అనర్హులే…

రణం న్యూస్ కోరుట్ల: సెప్టెంబర్30
గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలుంటే అనర్హత వేటు నిబంధన ఈ ఎన్నికల్లోనూ అమలు కానుంది. దీన్ని సడలించేందుకు పంచాయతీరాజ్‌శాఖ ప్రతిపాదనలు సమర్పించినా.. జనాభా రేటుపై శాస్త్రీయ సమాచారం లేదనే కారణంతో ప్రభుత్వం తొలుత తిరస్కరించింది. ఆ తర్వాత ఇటీవల పునరాలోచన చేసినా… శాసనసభలో చట్టాన్ని సవరించాల్సి ఉన్నందున సమయాభావం కారణంగా జరపలేదు. దీంతో ముగ్గురు పిల్లలున్నవారు ఈ ఎన్నికల్లో పోటీకి అనర్హులని అధికారులు ప్రకటించారు.
