కోరుట్ల గణేశ నవదుర్గా త్రిశక్తి మాత సేవా సమితి ఆధ్వర్యంలో అమ్మవారికి 108 నైవేద్యాలు

రణం న్యూస్ కోరుట్ల :ఆగస్టు 23 : కోరుట్ల పట్టణంలోని ఝాన్సీ రోడ్ గల గణేశ నవదుర్గా త్రిశక్తి మాత సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ ఆలయంలో శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి 108 నైవేద్యాలతో అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని, అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గణేశ నవదుర్గా త్రిశక్తి మాత సేవా సమితి అధ్యక్షులు కటుకం గణేష్, ప్రధాన కార్యదర్శి వడ్లకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ చివరి శ్రావణ శుక్రవారం మహిళలకు పవిత్రమైన రోజు మహిళలలు 108 నైవేద్యాలతో అమ్మవారికి సమర్పించి, వారి కోరికలను తీర్చమని వేడుకున్నారు. శ్రావణమాసం మహిళలకు అతి పవిత్రమైన మాసంగా పిలవబడుతుందని, అందులో భాగంగానే శ్రావణమాసంచివరి శుక్రవారం ఆలయంలో లలిత సహస్రనామ పారాయణం చేసినట్లు వారు తెలిపారు.
ప్రతి శ్రావణమాసంలో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నోములను నోచుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. దేవతలకు అత్యంత ప్రీతికరమైన మాసం. లక్ష్మీదేవి ఇష్టమైన మాసంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీపారా ధన చేయడం దీర్ఘ సుమంగళి ప్రాప్తం, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పేర్కొన్నారు.
తిథిలతో కూడా సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో కూడా పూజలు, పండుగలు చేసే మాసం ఈ శ్రావణమాసం మాత్రమేనని, అందుకే దీన్ని శుభప్రదమ్తెన మాసంగా భావిస్తారన్నారు. ఈ శ్రావణ మాసంలో శివకేశవులను నిష్టతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారని వివరించారు.
శ్రావణ సోమవారం, శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం, శ్రావణ శనివారం ఇలా ఈ మాసంలో ప్రతిరోజు విశిష్టతతో కూడుకున్నదేనని,
ఈ మాసంలో చేసే పూజలు విశేషమైన ఫలితాలిస్తాయని భక్తుల నమ్మకమని తెలిపారు.
శ్రావణమాసంలోనే వ్రతాలు, నోములు, ఉపవాసాలు పూజలు ఆచరిస్తారన్నారు.
ఈ మాసo ఆధ్యాత్మిక మాసం అని అంటారని కటుకం గణేష్, వడ్లకొండ శ్రీనివాస్ అన్నారు.
శ్రావణమాసం మహిళలకు ఎంతో ప్రీతికరమైన పవిత్రమైన మాసమని, మహిళలు చేసే వ్రతాలు ఈ నెలలో ఎక్కువగా ఉంటాయని,ఈ నెలను వ్రతాల మాసం అని, సౌభాగ్యాన్ని అందించే మాసమని కటుకం గణేష్, వడ్లకొండ శ్రీనివాస్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గణేశ నవదుర్గా త్రిశక్తి మాత సేవా సమితి అధ్యక్షులు కటుకం గణేష్, ఉపాధ్యక్షులు ఎలిగేటి సుమన్, ప్రధాన కార్యదర్శి వడ్లకొండ శ్రీనివాస్, సహాయ కార్యదర్శి మామిడిపల్లి రమేష్, కోశాధికారి అడువాల ప్రభాకర్, గజ్జల శంకర్, గాజుల రమేష్, చింతకింది సత్యనారాయణ, కరెంటు విజయ్, ముల్క గంగాధర్, కార్తీక్, అర్చకులు శివ, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.

