మందకృష్ణ మాదిగకు ఘనంగా సన్మానం
రణం: న్యూస్ మేడ్చల్ జిల్లా: ఏప్రిల్ 18,,కుత్బుల్లాపూర్
ఎంతో ఘన చరిత్ర గల పుల్లాస్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నిర్వహించిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సన్మాన సభ ఆధ్యాంతం ఆహ్లాదకరంగా సాగిందని,గత ముప్పయి ఏళ్లుగా నిరంతరంగా కొనసాగిన ఎమ్మార్పీఎస్ ఉద్యమం మొన్న ఏప్రిల్ పదునాల్గుణ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చేస్తున్నట్లు గెజిట్లో చేర్చిన సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన పుల్లాస్ ఫ్యామిలీ, మందకృష్ణ మాదిగను ఘనంగా సత్కరించారు.అదేవిధంగా లక్ష డప్పులు వేల గొంతులు కార్యక్రమాన్ని వెన్నంటి ఉండి అహర్నిశలు కష్టపడి ముందుకు నడిపించిన ఉద్యమ నాయకులు కళా నేతలు, పృథ్విరాజ్ యాదవ్,తెలంగాణ విట్టల్, ఇస్మాయిల్ బాయ్, వరంగల్ శ్రీనివాస్, ఏపూరి సోమన్న, మిట్టపల్లి సురేందర్,దరువు అంజన్న, దరువు ఎల్లన్న, అంతర్పుల నాగరాజు, వరంగల్ రవి,రామంచ భరత్. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్ తదితరులను పద్మశ్రీ మందకృష్ణ మాదిగ తన చేతుల మీదుగా సత్కరించారు.
సభలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ రేపటి తరంకై మనం పోరాడాల్సిన అవసరం ఉందని రాబోయే రోజుల్లో రాజ్యాధికారం మనదేనని అన్నారు,
ఈ సభకు ప్రొఫెసర్ పుల్లా శ్రీనివాస్ అధ్యక్షత వహించారని వివరిస్తున్నారు.


