రణం న్యూస్ జగిత్యాల:ఆగస్ట్7

జగిత్యాల జిల్లా స్వర్ణకార సంఘ.. ప్రమాణ స్వీకారం ఈరోజు నిర్వహించుకున్నారు. అనంతరం బ్రహ్మశ్రీ కోరుట్ల పట్టణానికి చెందిన కనపర్తి సత్యనారాయణ ను జిల్లా అధ్యక్షులు మూగల మారుతి జిల్లా అధికార ప్రతినిధిగా నియమించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ పాల్గొన్నారు.ఈ నియమాపకం పట్ల సత్యనారాయణ మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి తన వంతు కృషి చేస్థానని సంఘాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని అన్నారు. ఈ నియమాపకానికి సహకరిచిన సంఘ అధ్యక్షునికి ప్రధాన కార్యదర్శి శ్రీపాద సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. నియామపకం పట్ల బులియన్ మార్కెట్ గౌరవ అధ్యక్షులు బెజ్జరపు చంద్రయ్య, అధ్యక్షులు బెజ్జరపు శ్రీనివాస్ , తొగిటి రమేష్ , పబ్బోజి గంగాధర్ , వేగ్యారపు రాము , తొగిటి రమేష్, మండలోజీ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు.
