ముగిసిన మావోయిస్టు ఉద్యమ ప్రస్థానం..
16 మందితో లొంగిపోయిన అగ్రనేత దేవ్ జి
“కోరుట్ల” కు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జి
రణం న్యూస్ డెస్క్: ఫిబ్రవరి 22
(ఎడిటర్ ఆకుల మల్లికార్జున్)
ఉద్యమంకోసం ఉన్నవూరిని… కన్నవారిని తోబుట్టువులను…ఆత్మీయులను వీడి అడవి బాట పట్టిన ఆ ఉద్యమ కెరటం లొంగుబాటు దిశగా ఆడుగులువేసింది…నాలుగు దశాబ్దాల తన ఉద్యమ ప్రస్థానం నేటితో ముగిసింది.వనం వీడి జనంలోకి వస్తున్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ ని కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు స్వాగతీస్తున్నారు. “”కోరుట్ల”” నుండి మొదలైన విప్లవ తేజం జనజీవన స్రవంతిలోకి అడుగులువేస్తుంది.
ఆపరేషన్ కగార్‌లో కీలక పరిణామం. మావోయిస్టు పార్టీ టాప్ కమాండర్ దేవ్ అలియాస్ తిప్పిరి తిరుపతి సరెండర్ అయ్యారు. కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి సహా 16మందితో కలిసి ఆయన తెలంగాణ ఎస్ ఐ బి ముందు లొంగిపోయారు. మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామన్న కేంద్రం.. దేవ్, రాజిరెడ్డి టార్గెట్‌గా ఇటీవల ఆపరేషన్ కగార్-2 చేపట్టింది. ఈక్రమంలోనే వారిద్దరూ లొంగిపోయారు. 2 రోజుల్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం…

అగ్రనేతతో పాటు 16మంది లొంగుబాటు:
అగ్రనేతలు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి సరెండర్, వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో ఇప్పటికే ఉనికి కోల్పోయిన మావోయిస్టు పార్టీ…4 దశాబ్దాలకు పైగా సాగిన సాయుధ పోరాటానికి ముగింపు, ఆపరేషన్ కగార్‌లో వందలమంది మావోయిస్టుల హతమయ్యారు.మార్చి 31కల్లా ఆపరేషన్ కగార్‌కు కేంద్రం గడువు, ఇప్పటికే హిడ్మా సహా కీలక మావోయిస్టుల ఎన్కౌంటర్, ఇటీవలే లొంగిపోయిన మల్లోజుల, ఆశన్న తదితర నేతలు, ఇప్పటికే అనారోగ్యంతో విదేశాల్లో ఉన్న గణపతి, బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కోసం వేట ప్రారంభించనున్నట్లు తెలిపారు.

