క్యాన్సర్ బాధిత మహిళకు మహిళకు ఆర్థిక సహాయం

రణం న్యూస్ కోరుట్ల:జులై 8
రహీంపుర బాబ్రీ చౌక్ ప్రాంతానికి చెందిన ఓ నిరుపేద మహిళ క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె వైద్య ఖర్చులకు అండగా నిలుస్తూ, మానవత్వాన్ని చాటారు ఇద్దరు సీనియర్ జర్నలిస్టులుఈ మహిళకు సహాయంగా రహీంపురా బాబ్రీ చౌక్ కు చెందిన ప్రముఖ సీనియర్ జర్నలిస్టులు మహమ్మద్ అబ్దుల్ మతీన్, మహమ్మద్ అబ్దుల్ ముబీన్, సమద్ కిరాణం యజమాని అబ్దుల్ హమీద్ కలిసి రూ.15,000/- ఆర్థిక సహాయాన్ని అందించారు. సోదరులైన పత్రిక విలేకరులు చేసిన సాయాన్ని పట్టణ ప్రజలు ప్రాంత వాసులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ ముజాహిద్, అహ్మద్ అబ్దుల్ హఫీజ్, అఫ్సర్, మహమ్మద్ హసీబ్, మొహమ్మద్ ఖిజార్ మున్ఫియాత్, మహమ్మద్ మజ్, మహమ్మద్ జునేద్, ఖురేషి పాషా తదితరులు పాల్గొన్నారు.

