ఆ ప్రేమ బంధమే… ప్రాణం తీసిందా…
సోషల్ మీడియా నే ఆ అబల ప్రాణం బలిగొందా…
టెక్నాలజీ కొందరు అభివృద్ధి కోసం వాడితే…
యువత వినాశనానికి దారితీస్తుందా…
:రణం న్యూస్ కోరుట్ల: మార్చి 18,
ప్రేమ అనేది ఒకప్పుడు జీవితాంతం నిలిచే బంధానికి పునాది. కానీ నేటి సమాజంలో అదే ప్రేమ, క్షణిక ఆవేశాలకు బలై ప్రాణాంతక పరిణామాలకు దారి తీస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. వైష్ణవి,హరిబాబు ఘటన అలాంటి విషాదకర వాస్తవానికి ప్రతిబింబం. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట, ఏడాది కూడా గడవకముందే హత్యతో ముగియడం కేవలం ఒక కుటుంబ విషాదం మాత్రమే కాదు.సమాజం ఎదుర్కొంటున్న బంధాల బలహీనతలకి నిదర్శనం గా చెప్పవచ్చు
మారుతున్న మనస్తత్వాలు…
ఈ ఘటనను ఒక వ్యక్తిగత వివాదంగా మాత్రమే చూడలేం. ఇది మారుతున్న మనస్తత్వాల, తగ్గుతున్న సహనానికి, పెరుగుతున్న అనుమానాల ప్రతిఫలం. ప్రేమ అనేది కేవలం భావోద్వేగం కాదు; అది బాధ్యత, పరస్పర గౌరవం, అంకితభావం. కానీ ఈ విలువలు తగ్గిపోతున్నాయి. చిన్నచిన్న విభేదాలను పెద్ద సమస్యలుగా మలచే ధోరణి పెరుగుతోంది.

యువత ఆలోచన రాహిత్య స్వతంత్ర నిర్ణయాలు….
ఇప్పటి యువత వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు…ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం, అలాగే విభేదాలు రావడం కూడా అంతే వేగంగా జరుగుతోంది. కానీ సంబంధాన్ని నిలబెట్టేందుకు అవసరమైన సహనం, సంభాషణ, పరస్పర అవగాహన లోపిస్తున్నాయి. సమస్యలను చర్చించి పరిష్కరించుకోవడం కంటే, ఆవేశంతో స్పందించడం ప్రమాదకరంగా మారుతోంది.
సమాజం తో పాటు… మారిన సాంకేతికత కూడా కారణమే..
ఇది కేవలం వ్యక్తుల వైఫల్యం కాదు..సమాజం, కుటుంబ వ్యవస్థ, విలువల పతనానికి సంకేతం. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజం కలిసి యువజంటలకు మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. భావోద్వేగ నియంత్రణ, వివాద పరిష్కార పద్ధతులు, మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచాల్సిన సమయం వచ్చింది.
ఇలాంటి ఘటనలు అపలేమా..
ప్రేమ బలమైనది… కానీ దాన్ని నిలబెట్టేది మన మనసుల బలం. కోపం క్షణికమైనదే అయినా, దాని ఫలితం శాశ్వతం. బలహీనమౌతున్న బంధాలను బలపరచడం ప్రతి ఒక్కరి బాధ్యత. లేకపోతే ఇలాంటి విషాదాలు మరిన్ని కథలుగా మారే ప్రమాదం ఉందో వేచి చూడాలా.. ఇలాంటి సంఘటనలకు మూల కారణాలు వేతకాల అర్ధం కాని పరిస్థితే…

