ఫిర్యాదులు చేస్తేనే అధికారుల స్పందన…
తీరు మారని ఇరిగేషన్ …. బల్దియా అధికారగణం..
మంది మార్బలం తో నీటి కాలువ పై నిర్మాణం…..
ఎన్ ఓ సి లు ఉన్నాయంటూ…మున్సిపల్ అధికారుల బుకాయింపు….
ఎన్ ఓ సి లేదంటూ ఇరిగేషన్ అధికారుల స్పస్టికరణ…..
అయినా…నీటి కాలువ పై నిర్మాణామ్ తొలగించని వైనం….
ఎలాంటి ఎం ఓ సి ఇవ్వలేదు….
ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ వెంకటేష్ …
రణం న్యూస్ కోరుట్ల: డిసెంబర్ 3:
*ఇక్కడ బలం ఉన్నోడిదే రాజ్యం…పైసలున్నోడికే పనులు.. అధికారుల అండ దందా అంత వీరికే… అందుకే తప్పులు ఒప్పులు అవుతాయి…. ఇది ఎక్కడనో తెలుసా…చెరువులను,కుంటలను,కాలువలను కపుడుతుంటే జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ అధికారులు మాత్రం కాలువలను కబ్జా చేసే రియల్ ఎస్టేట్స్ వ్యాపారులకు మాత్రం కాలువ పక్కన నిర్మిస్తున్న కట్టడాలకు ఫిర్యాదులు చేస్తే పర్మిషన్ లు ఉన్నాయనడం….తర్వాత అనుమతులు లేవంటూ కూల్చడం గమనార్హం.

ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ వెంకటేష్ ను ఈ నిర్మాణం పై వివరణ అడగగా కోరుట్ల పట్టణంలోని మద్దుల చెరువు కాలువ మీద గాని కాలువ ప్రక్కన గాని ఎటువంటి నిర్మాణాలకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. అట్టి నిర్మాణాలకు ఇవ్వం అని సమాధానం ఇచ్చారు.మున్సిపల్ అధికారులకు కూడా కాలువ పై మేము లేటర్ రాసి ఇవ్వడం జరిగింది అని మద్దుల చెరువు మత్తడి కాలువ డ్రైనేజి అని మాకు ఎటువంటి సంబంధం ఉండదని దాటవేయడం గమనార్హం.

ఇరిగేషన్ అధికారులు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చారు. ..
కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రవీందర్
మద్దుల చెరువు నిండి మత్తడి నుండి కాలువ పై నిర్మించిన కల్వర్టు నిర్మాణం కాలువ ప్రక్కన నిర్మిస్తున్న కట్టడంపై కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రవీందర్ ను వివరణ అడగగా అవునండి ఆ నిర్మాణానికి పర్మిషన్ ఉంది.అలాగే ఇరిగేషన్ అధికారులు కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చారు. అన్నడం కోస మెరుపు.
నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చారంటూ మున్సిపల్ కమిషనర్..? నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వలేదంటూ…? ఇవ్వరాదంటూ…? ఇరిగేషన్ అధికారి.మరి వీరు చెప్పిన మాటలు ఎంతవరకు నిజమో…? ఎంత వరకు…అబద్ధమో…?చూద్దాం..

ఈ నిర్మాణం హఠాత్తుగా ఎందుకు కూల్చినట్లు…
నిర్మాణాలు చేస్తున్నారు అని వారం రోజుల నుండి మున్సిపల్ అధికారులకు పలుసార్లు తెలిపిన అనుమతులుంన్నాయంటూ… అక్కడ కాలువల ఆనవాళ్లు రికార్డుల్లో లేవంటూ సమాధానం ఇచ్చి…. ఈ రోజు హఠాత్తుగా హుటా హుటిన ఐలాపూర్ రోడ్ లో కట్టడాలను కూల్చి వేయడం లో ఆంతర్యం ఏంటో మరి.. ఈ అధికారులు రోజుకొరకంగా వ్యవహరించడం పలుఆనుమానాలకు తావిస్తోంది…

