నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు
జగిత్యాల జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ముస్కు జైపాల్ రెడ్డి
రణం న్యూస్ కోరుట్ల: మార్చి24
కోరుట్ల పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను, స్కానింగ్ సెంటర్లను జగిత్యాల డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి, మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలని అతిక్రమించిన వారిపై క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్:ఆసుపత్రులు, క్లినిక్స్ వంటి వైద్య సంస్థలు ప్రభుత్వ నియమాల ప్రకారం నమోదు అయి, ప్రమాణాలకు అనుగుణంగా సేవలు అందించాలి అనే చట్టం ను,పి.సి.పి.ఎన్.డి.టి యాక్ట్,గర్భంలో ఉన్న శిశువు లింగాన్ని తెలుసుకోవడం లేదా చెప్పడం నిషేధించి, ఆడ శిశువుల హత్యను నివారించడానికి రూపొందించిన చట్టాల ప్రకారం చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. అనుమతుల కోసం రిజిస్ట్రేషన్ సమయంలో సమర్పించిన డాక్టర్ల ద్వారా నే వైద్య సేవలు అందించాలని, కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల లో మళ్ళీ జతచేయాలని అలా చేశాకే వారి సేవలు వినియోగించుకోవాలని తెలిపారు.

1994 గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధిత చట్టం యాక్ట్ ప్రకారం లింగ నిర్ధారణ చేసి ఆడ ,మగ అని చెప్పడం చట్టరీత్యా నేరమని మాత శిశు సంరక్షణ ఆయన పేర్కొన్నారు. స్కానింగ్ సెంటర్లలో స్కానింగ్ మిషన్స్ డాక్టర్ల అర్హత ధ్రువీకరణ పత్రాలు దరఖాస్తు చేసుకున్న విధంగానే ఉన్నాయా అని నిర్ధారించుకున్నారు. ఫారం ఎఫ్ లు ప్రతినెల 5వ తారీఖు లోపు వారికి కేటాయించబడిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో లలో అప్పజెప్పాలని ఫారం ఎఫ్ లు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ఒకే విధంగా ఉండాలన్నారు. లింగ నిర్ధారణ చేసేటప్పుడు లింగ నిర్ధారణ చట్టరిత్యా నేరం అలా చేసినచో కఠిన చర్యలు తీసుకోబడతాయి అను ఫ్లెక్సీ బోర్డులు , ఫోం బోర్డులు ఏర్పాటు చేయవలెనని ఈ నిబంధనలు అతిక్రమించి లింగ నిర్ధారణ చేసినచో జరిమానా విధించబడడమే కాకుండా మూడు నెలల జైలు శిక్ష కూడా ఉంటుందని, వైద్యుల యొక్క రిజిస్ట్రేషన్ కూడా రద్దుపరుచబడతాయని తెలిపారు. ఈకార్యక్రమంలో ఆరోగ్య విస్తీర్ణ అధికారి రాజేశం, సూపర్ వైసర్లు నాగభూషణం, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.

