పలు స్కానింగ్ సెంటర్ల పరిశీలన..
సాధారణ ప్రసవాలకే మొగ్గు చూపాలి…
జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ముస్కు జైపాల్ రెడ్డి.
రణం న్యూస్ కోరుట్ల,నవంబర్ 29,
ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఇస్తామని అన్ని రకాల సేవలకు సిబ్బంది సిద్ధంగా ఉన్నారని డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ ముస్కు జైపాల్ రెడ్డి అన్నారు.శనివారం కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.గర్భిణీ మహిళల కు సేవలు ఏవిదంగా అందుతున్నాయని,వారికి ఎలాంటి ఇబ్బంది కలిగిన తమను సంప్రదించాలని వారికి సూచించారు.గర్భిణీ స్త్రీలను అడిగి వారి సమస్యలపై ఆరా తీశారు.తల్లి పిల్లల ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు.కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆశవర్కర్,ఏ ఎన్ ఎం ,సూపర్ వైసర్ ల పనితీరు గురించి తెలుసుకున్నారు. మహిళలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు కుడా నిర్వహిస్తామని తెలిపారు. గర్భిణీ స్త్రీలను,ప్రసవాలు జరిగిన వారిని కలిసి వసతుల గురించి ఆరాతీశారు.సమీక్ష సమావేశం నిర్వహించి అనంతరం అన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో ఏరియా ఆసుపత్రి సూపరెండేంట్ సునీత రాణి, వైద్యురాలు చైతన్య సుధ, విజయలక్ష్మి వైద్యులు వినోద్, రమేష్, హెల్త్ ఎడ్యుకేటర్ భూమేష్,శంకర్ సూపర్వైసర్ లు శ్యామ్ ధనుంజయ్, నాగభూషన్ ఫార్మాసిస్ట్ ఉదయ్ ప్రసాద్, రబ్బానీ రియాజ్,సాజిద్ ఏ ఎన్ ఎం లు,ఆశ కార్యకర్తలు సిబ్బంది పాల్గొన్నారు.

పలు స్కానింగ్ సెంటర్ల తనికీ..
స్కానింగ్ సెంటర్ల తనికీ నిర్వహించి నామ్స్ ప్రకారం అన్ని నిబంధనలు పాటించాలని,లింగ నిర్దారణ పరీక్షల సమయంలో గోప్యత పాటించాలని,అలాంటి గోప్యత పాటించకుంటే చట్టరీత్య కేసులు నమోదు చెపిస్తామని,వారు శిక్షార్హులేనని ఉప వైద్యాదికారి జైపాల్ రెడ్డి ఈ సందర్బంగా ఆదేశాలు జారీ చేశారు.


