రణం: న్యూస్ కోరుట్ల:, ఏప్రిల్ 15: పౌష్టికాహారంతోనే పిల్లలు పరిపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని మెట్ పల్లి ఐసీడీఎస్ సీడీపీఓ కాశ్ పాక మణెమ్మ అన్నారు. పోషణ పక్వాడ్, పోషణ పక్షంలో భాగంగా మంగళవారం కోరుట్ల పట్టణంలోని మ్యాదరి వాడ అంగన్ వాడి కేంద్రంలో గర్భిణీ, బాలింతలకు పరిసరాల పరిశుభ్రత, రక్తహీనత గురించి ఆమె అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సీడీపీఓ కాశ్ పాక మణెమ్మ మాట్లాడుతూ పిల్లల ఎదుగుదలకు పోషక విలువలతో కలిగిన ఆహారం అందించాలని అన్నారు. పిల్లల ఎత్తు, బరువు, జబ్బ చుట్టు కొలత తీసుకోవాలని సూచించారు. గర్భవతుల సంరక్షణ గురించి పరిపూర్ణ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్ వైజర్ ఏ. భారతి, అంగన్ వాడి టీచర్ ఎస్. లక్ష్మీప్రసన్న, ఏఎన్ఎం శిరీష, ఆశలు తదితరులు పాల్గొన్నారు.

