బాల్యం భవిష్యత్తుకు బాటలు వేద్దాం…
సేవాభావం లయన్స్ క్లబ్ లక్ష్యం
కోరుట్ల లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొమ్ముల జీవన్ రెడ్డి

రణం న్యూస్ కోరుట్ల, సెప్టెంబర్ 19: నేటి బాలలే రేపటి భారత దేశ భవితవ్యానికి పునాది అని, బాల్యం భవిష్యత్తుకు బాటలు వేసేందుకు లయన్స్ క్లబ్ సేవా భావoతో పని చేస్తుందని కోరుట్ల లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొమ్ముల జీవన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కోరుట్ల లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా ఏసుకొని గుట్ట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన వస్తువుల వితరణ చేశారు. ఈ సందర్భంగా కోరుట్ల లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొమ్ముల జీవన్ రెడ్డి మాట్లాడుతూ సేవే లక్ష్యం గా పెట్టుకొని లయన్స్ క్లబ్ పని చేస్తుందని ఇందులో భాగంగా గడ్డమీది ఎల్లయ్య గౌడ్-పుష్ప స్మారకార్ధం కుమారుడు,కోడలు
సునీల్ కుమార్- లహరి సేవా దృక్పథంతో కోరుట్ల ఏసుకొని గుట్ట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన వస్తువులు, అంగన్ వాడీ చిన్నారులకు మధ్యాహ్న భోజనానికి ప్లేట్లు,గ్లాసులు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈకార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కొమ్ముల జీవన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏలేటి లక్ష్మారెడ్డి, కోశాధికారి నల్ల గంగాధర్, లయన్స్ గంటుక సురేష్ బాబు, ఆడెపు మధు, అజయేందర్ రావు, ధనంజయ్, గాజంగి నాగభూషణం, కేజీ కృష్ణ, పుప్పాల ప్రభాకర్, భూoరెడ్డి పడాల నారాయణ గౌడ్, గంగుల రాజ శేఖర్, కల్లెం గంగారెడ్డి, బెజ్జంకి శ్రీనివాస రావు, ప్రధానోపాధ్యాయులు అజయ్, టీచర్లు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

