రణం న్యూస్ కోరుట్ల, ఆగస్టు 31: కోరుట్ల పట్టణంలోని ఝాన్సీ రోడ్ లోని గణేశ నవదుర్గా త్రిశక్తి మాత సేవా సమితి ఆధ్వర్యంలో త్రిశక్తి ఆలయంలో ఫ్రెండ్లీ మహిళల గోరింటాకు సందడి అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం దుర్గామాత ఆలయంలో మహిళలను ఒక చోట అందరిని కలిపి గోరింటాకు పెట్టుకొని సంబరాలు నిర్వహిస్తున్నట్లు మహిళలు తెలిపారు. శ్రీ దుర్గామాత సన్నిధిలో మహిళలందరం గోరింటాకు పెట్టుకొని అమ్మవారిని ప్రార్థిస్తూ, ప్రతి ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దుర్గాదేవి అనుగ్రహంతో ఆశీస్సులతో పసుపు కుంకుమలతో నిత్యం సౌభాగ్యంగా ఉండాలని దీవించాలని అమ్మవారిని వేడుకోవడం జరిగిందని మహిళలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

