జిల్లా వైద్యాధికారి కె ప్రమోద్ కుమార్

రణం న్యూస్ కోరుట్ల:సెప్టెంబర్ 23
స్వస్త్ నారి స్వశక్తి పరివార్ అభియాన్ ఆరోగ్య మహిళ శక్తి వంతమైన కుటుంబం) లో భాగంగా కోరుట్ల ఏరియా హాస్పిటల్ లో క్షయవ్యాధిగ్రస్థులకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్ పాల్గొని క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టిబి మందులు ప్రభుత్వం నుండి ఉచితంగా ఇస్తున్నట్లే ,రోగులకు పొష్టికాహారం ఇచ్చేందుకు దాతలు ముందుకు రావాలని , ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహకారం ఎల్లవేళలా ఉండాలని,పేద రోగులకు ఈ సేవలు ఎంతో ఉపయోగ పడతాయని వ్యాధిగ్రస్థులందరికి నిక్షయ మిత్ర గా ముందుందాలని తెలిపారు.ప్రజాప్రతినిధులు,సామాజిక సేవకులు ముందుకు వచ్చి ఈ వ్యాధిగ్రస్తులు చేయూతనివ్వాలని కోరారు.ఇప్పుడున్న రోగులకు మునుముందు వ్యాధి బారిన పడ్డవారికి కూడా చేదోడుగా ఉండాలని ఆయన తెలిపారు. జిల్లా ఉప వైద్యఅధికారి డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ స్వచ్చందంగా ముందుకు వచ్చి క్షయ రోగులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజాషన్ అధికారి ఆకుల శ్రీనివాస్ ఐ ఎం ఏ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డాక్టర్ వై. అనూప్ రావ్ ,కోరుట్ల అధ్యక్షులు డాక్టర్ రేగొండ రాజేష్ లు పాల్గొని అనంతరం టిబి రోగులకు న్యూట్రిషన్ ఫుడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు వినోద్ ,లక్ష్మి, డిపిఓ తులసి రవీందర్, సీసీ కుతుబొద్దిన్, సూపర్ వైసర్ మంకిడి శ్రీనివాస్ ,డిపిపిఎం హరీష్, మల్లికార్జున్ ,టిబి ల్యాబి సూపర్వైసర్ రియాజ్,ఫార్మసీ ఆఫీసర్ ఉదయ్ ప్రసాద్, టిబి సూపర్వైసర్ లు ఇమ్రాన్,ఆంజనేయులు రబ్బానీ,ఆశ వర్కర్ లు సిబ్బంది పాల్గొన్నారు కార్యకర్తలు సిబ్బంది పాల్గొన్నారు.

