అసలు చెక్ బౌన్స్ కు కారకులెవరు…
వివాహిత ఆత్మహత్య కు బాధ్యులెవరు…
పూచీకత్తు పొందిన వ్యాపారి ఎవరు…
ఆ చెక్ బౌన్స్ లే బలవన్మరణానికి కారణమా…?
రణం న్యూస్ కోరుట్ల:జనవరి12
ఆమె అభం శుభం తెలియని అమాయకురాలు…కష్టపడి చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం సాధించింది.. లక్ష రూపాయల పైగా జీతం. ఆమెకు ఇద్దరు కుమారులు.. ఆమె భర్త అత్యాశనా… ఆమె భర్త ఆశను ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు వంచించారా… ఓ చిట్ ఫండ్ కంపెనీలో యాక్షన్ చిట్టి లో కోటి రూపాయల చీటి కి పూచీకత్తుగా ఒక వ్యాపారికి సంతకం పెట్టించాడని సమాచారం… చీటి ఎత్తుకున్న వ్యాపారి నెల నెలవారి కిస్తులు కట్టకపోవడం కారణంగానే చెక్ బౌన్స్ లు అయినట్లు.. చిట్ ఫండ్ కంపెనీ వారు తరుచూ ఇంటికి వస్తు గంటల తరబడి కూర్చుని వేధించే వారని, కోటి రూపాయలు యాక్షన్ చీటి తీసుకున్న వ్యాపారి బాగానే ఉన్నాడు…కానీ పూచీకత్తుపెట్టిన పాపానికి అవమానబారంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియవస్తుంది. చీటి తీసుకున్న వ్యాపారి కిస్తులు కట్టకపోవడమే కారణమా… అవమాన భారమా… వివరాలు తెలియాల్సిఉంది

వివరాల్లోకి వెళితే..కోరుట్ల పట్టణంలోని ఆదర్శ్ నగర్ కి చెందిన వంగ రమ్యసుధ (34) సోమవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రభుత్వ ఇద్యోగి కావడంతో భర్త శ్రీధర్ ప్రోద్బలంతో ఓ వ్యాపారికి పూచీకత్తు సంతకం పెట్టినట్లు.. పూచీకత్తు తో చీటి పొందిన వ్యాపారి సరిఅయిన సమయంలో కిస్తులు కట్టకపోవడంతో చెక్కులు బౌన్స్ అయ్యాయని ఆ కారణంగా భర్తతో తరుచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఆమె భర్త శ్రీధర్ కోరుట్లలో శబరి మ్యాచింగ్ సెంటర్ నడిపిస్తున్నాడు. రమ్యాసుధ వరంగల్ లోని గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. సంక్రాంతి సెలవుల నిమిత్తం తన ఇంటికి వచ్చినట్లు తెలుస్తుంది. తన ఇద్దరు కుమారులను బయట ఆడుకొమ్మని పంపి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. రమ్యసుధా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోరుట్ల ఏరియా హాస్పిటల్ కు తరలించారు. సమాచారం అందుకున్న కోరుట్ల పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, భర్త శ్రీధర్నీ అదుపులో తీసుకొని వివరాలు సేకరిస్తున్నారు.ఒక చిట్ ఫండ్ కంపెనీ కి, ఒక వ్యాపారికి ప్రభుత్వ ఉద్యోగి గా శూరిటీ పెట్టిన పాపానికి అవమాన భారంతో ప్రాణం తీసుకునే స్థాయి కి వెళ్లినట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది ఏమైనా మరిన్ని వివరాలు పోలీసుల విచారణ అనంతరం బయటకు తెలిసే అవకాశం ఉన్నది.

