దేవాలయం కు అడ్డుగా చెత్త ట్రాక్టర్ పార్కింగ్.. సోషల్ మీడియాలో వైరల్
నత్తనడకన పార్కింగ్ షెడ్ పనులు
రోడ్ల పై నిలిపి ఉంచుతున్న బల్దియా చెత్త వాహనాలు
రణం న్యూస్ కోరుట్ల :ఆగస్ట్31
“””కోరుట్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కన ఉన్న దుర్గా దేవిఆలయం ముందర మున్సిపల్ చెత్త టాక్టర్ రోజునిలపడం జరుగుతుంది మున్సిపల్ కమిషనర్ గారు కొంచెం చూడండి హిందూ దేవాలయాలను పట్టించుకోండి“””

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ని కల్లూరు రోడ్ లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు దగ్గర దుర్గాదేవి ఆలయం ఎదురుగా చెత్త ట్రాక్టర్ ను పార్కింగ్ చేస్తున్నారని ,కొన్ని వర్గాల ప్రార్థన మందిరాలను పట్టించుకోండి సోషల్ మీడియా లో పెట్టిన పోస్ట్ చక్కర్లు కొడుతోంది. నేటిజెన్లు తాము కూడా అదే కోరుకుంటున్నట్లు స్పందిస్తున్నారు
నత్తనడకన వాహనాల పార్కింగ్ షెడ్ పనులు:-

బల్దియా వాహనాల పార్కింగ్ షెడ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఎక్కడి వాహనాలు అక్కడే రోడ్లపై పార్కింగ్ చేస్తున్నారు.చెత్త సేకరణ వాహనాలు అన్ని స్థలం లేక బయటనే ఉంటున్నాయి.ఈ వాహనాలు రోడ్లపై నిలిపి ఉంచడంతోదుర్వాసనతో పాదచారులకు, పక్కనే ఉన్న విద్యార్థులకు అవస్థలు పడుతున్నారు.పార్కింగ్ షెడ్ నిర్మాణం పూర్తి చేసి బల్దియా వాహనాలు కార్యాలయ పార్కింగ్ లో ని నిలిపేలా చూడాలని పలువురు కోరుతున్నారు.


