జాడలేని ఫుడ్ ఇన్స్పెక్టర్….. సంబంధిత అధికారులు…
ఏడాది క్రితం తనికీల్లో కుళ్ళిన నిల్వవుంచిన ఆహారపదార్థాలు ఈ “F 3 “రెస్టారెంట్లో లభ్యం
గతంలో తు.. తు… మంత్రంగా జరిమానా
రణం న్యూస్ కోరుట్ల:ఆగస్ట్27

బిల్లు లో ఎలాంటి కాంప్రమైజ్ కారు.. శుభ్రత పాటించరు..హంగులు ఆర్భాటాలకు కొదవ ఉండదు.వెయిటర్ లకు యూనిఫార్మ్ లు స్టార్ హోటళ్లను తలపించే బిల్డప్పులు అందులో పనిచేసే పని వాళ్లకు మన భాష రాదు.మన మాట అర్థం కాదు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఫుడ్ కోర్టులు. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం లోని సాయిబాబా గుడి సమీపంలో గల గౌతమ్ మోడల్ స్కూల్ ఎదురుగా ఎఫ్ 3 ( F3 )రెస్టారెంట్ లో బిర్యానీ తిందామని వెళ్లితే పురుగులతో కూడిన సూప్ తీసుకొచ్చి పెట్టారని సోషల్ మీడియాలో వీడియో వైరల్ ఆవుతున్నది. గతంలో రెస్టారెంట్ల పై తనికీలు చెయ్యగ నిల్వవుంచిన మాంస కృత్తులు కిలోలు,వండిన కూరలు లభ్యమయ్యాయి.

తు.. తు.. మంత్రంగా జరిమానాలు

చాలా చోట్ల నాసిరకం ఆహారం దొరకడంతో కల్తీ, నాసిరకం ఆహారం తయారు చేస్తున్న రెస్టారెంట్లు, హెూటళ్లకు జరిమానాలు గతేడాది విధించారు. ఇదే తనికీల్లో కొన్ని హెూటల్ వంటశాలలల్లో అపరిశుభ్రత, మురుగుకాలువల పక్కన వండిన ఆహారం ఉంచడం కుళ్ళిన వాసనలు రావడం ఈ తనికీల్లో దర్శనమిచ్చాయి. జరిమానాలు తు..తు.. మంత్రంగా వేశారని పలువురు విమర్శించారు. కల్తీ కాలం చెల్లిన, నిల్వవుంచిన ఆహార పదార్థాలను ప్రజలకు అంటకట్టడం వల్ల ప్రజలకు ప్రాణాంతక మైన వ్యాధులు బారిన పడుతున్నారు.సీజ్ చేయాల్సిన హోటల్ లను రెస్టారెంట్ల ను ఐదువేలు పదివేలు జరిమానాలు వేసి చేతులు దులుపుకుంటున్నారు.ఫైన్ లు వేసి చేతులు దులుపుకొన్నరో…జేబులునింపుకున్నారో..ఇప్పటికైనా అధికారులు పర్యవేక్షణ చేసి ప్రజారోగ్యం కాపాడాలని వేడుకుంటున్నారు.

