అధికారి డబ్బాలో డబ్బులు వేస్తేనే ఫైలు కదులుతుందట….
ప్రతి పనికో రేటు…ఆటా..
లిఖిత పూర్వక పిర్యాదు పై చర్యలుంటాయో.. లేదో..వేచి చూద్దాం…
రణం :న్యూస్ కథలాపూర్:ఆగస్టు12,
గత ప్రభుత్వ వ్యవస్థలో కొందరు రాజకీయ నాయకుల అండ ఉన్న అవినీతి అధికారుల మూలంగా నిజాయితీపరులైన సాధారణ ప్రజల ఆస్తులకు.. ముఖ్యంగా భూములకు రక్షణ లేకుండా పోయింది. ఎవరి ఆస్తులు ఎవరికి బదిలీ చేస్తారో తెలియని అయోమయ పరిస్థితిని రైతులు ఎదుర్కొన్నారు. ఆనాటి భూస్వాముల నుంచి సాదా బైనామా పత్రాలతో కొనుగోలు చేసి మూడు నాలుగు దశాబ్దాల కాలం సాగు చేసుకున్న రైతులు ప్రస్తుతం ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ధరణి పోర్టల్ ఉపసంహరించినప్పటికీ భూభారతి వొచ్చినప్పటికీ అవినీతి యథావిధిగా కొనసాగుతూనే ఉందని రైతులు ఆందోళన పడుతున్నారు. ప్రభుత్వాలు, పాలకులు మారినా అవినీతి అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బాధిత ప్రజలు ఆవేదన చెందుతున్నారు.రాజకీయ నాయకుల చలవతోనే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు వారికి కావలసిన జిల్లా, డివిజన్, మండలాలలోకి బదిలీ చేయించుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.అధికారులకు నాయకుల అండదండలు ఉండటంతో చెలరేగిపోతున్నారు అనే వాదనలు వినిపిస్తున్నాయి…
తహసీల్ధార్ పై చర్యలు తీసుకోవాలి…
బిసి సంక్షేమ సంఘం జిల్లా నాయకులు యాగండ్ల రమేష్…

వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా కథలపూర్ తహసీల్ధార్ పనితీరుపై బీసీ సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా నాయకులు యాగండ్ల రమేష్ తీవ్ర ఆరోపణలు చేశారు..మా మండలంలో అవినీతి పెరిగిపోయిందని,ప్రతిపనికి ఒక రేటు ఉంటుందని ఆరోపించారు.తహశీల్ధార్ ఆఫీసు అస్తవ్యష్ఠంగా ఉందని,వందల ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయిందని, డబ్బులిస్తేనే రిజిస్ట్రేషన్ లు చేస్తున్నారని ,మైనింగ్ మొదలుకొని అన్ని పనులకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని రమేష్ తెలిపారు. చివరకు విద్యార్థుల కుల ధ్రువీకరణ,ఆదాయ ధ్రువీకరణ పత్రాలకి కూడా డబ్బులు అడుగుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఈ విషయాన్ని ప్రశ్నిస్తే విధులకు భంగం కలిగిస్తున్నారని కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెట్టాలని,అధికారుల పై చర్యలు తీసుకోవాలని సోమవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కు తహసీల్దార్ పై పిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.అధికారుల పై లిఖిత పూర్వకంగా పిర్యాదు చేసిన చర్యలు ఉంటాయో లేదో.. వేచిచూద్దాం..

