పోటీలో పలువురు అభ్యర్థులు..*
*సంబరాలు చేసుకుంటున్న గ్రామ ప్రజలు..*
*మాకు ఓటు హక్కు ఉంది…మేము ఓటు వేస్తాం…*
*రిజర్వేషన్ లు మారడంతో సర్పంచ్ ఎన్నికలు*
రణం న్యూస్ డెస్క్:* డిసెంబర్7
(ఆకుల మల్లికార్జున్… ఎడిటర్)
అది జగిత్యాల జిల్లాలోని గ్రేడ్ 2 మున్సిపల్ మండలంలోని అత్యంత రాజకీయ చైతన్యం గల గ్రామపంచాయతీ.. ఆ గ్రామ పంచాయతీ మండల కేంద్రముకు అనుకుని ఉంటుంది. ఆ ఊరి పొలిమేర మండల కేంద్రం తో కలిసే ఉంటుంది. ఆ గ్రామంలోని నాయకులకు ప్రస్తుత నియోజక వర్గం..ప్రస్తుత జగిత్యాల జిల్లా… ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన గ్రామం ఈ గ్రామంలో ప్రజలు పదిహేను ఏళ్ల తర్వాత గ్రామధ్యక్షుడు (సర్పంచ్)ని ఓటు హక్కు తో ఎన్నుకోబోతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. రిజర్వేషన్ పుణ్యమా అని సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయని లేదంటే మళ్ళీ మాకు ఓటు వేసే అవకాశం దక్కేది కాదని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో గత మూడు దఫాలుగా అంటే పదిహేను ఏళ్లుగా గ్రామాధ్యక్షుడి(సర్పంచ్)ఎన్నిక ఏకగ్రీవం కావడం తమ ఓటు హక్కును వినియోగించుకోలేక పోయామని చాలామంది చెప్పకనే చెప్తున్నారు.కానీ రిజర్వేషన్ ల పుణ్యమా అని ఎస్సీ మహిళ కావడంతో ఏకంగా నలుగురు పోటీలో నిలిచారు.హోరాహోరుగా ప్రచారాలు కూడా చేస్తున్నారు.దీనితో ఈ గ్రామ ప్రజలు మా గ్రామప్రజలకు…పదిహేను ఏళ్ల తర్వాత ఓటు వేసే అవకాశం వచ్చిందోచ్…మా గ్రామానికి సర్పంచ్ ఎన్నికలొచ్చాయి…మాకు ఓటు హక్కు ఉంది…మేము ఓటు వేస్తాం… అంటూ ఒకరితో ఒకరు చర్చించుకున్నారు.
ఈ గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని వర్గాల వారు అంటే యువత,మహిళలు, వృద్ధులు ఓటు హక్కు ప్రతి ఒక్కరు ఆసక్తి చూపడం, నేను ఒక్కడినే ఓటు వేయకపోతే మన తలరాతలు మారవు అని కాకుండా నా ఓటు నేను ఈసారి వేస్తాను… అనే సమర్థించుకునే ధోరణి లో ఒక్క ఓటుతోనే రాతలు మారకున్న మార్చగలం అని భావన ఈ గ్రామంలో చాలాశాతం ప్రజల మాటల్లో తెలియవస్తుంది…నిజం చెప్పాలంటే ఐదేళ్లకోసారి మన భవిష్యత్ కోసం ఒక్క గంట కేటాయిస్తే చాలు..నిజంగానే మన తలరాత తో పాటు, చాలా మంది తలరాతలు మారుతాయని భావనకు వచ్చారు ఈ గ్రామ ప్రజలు. ఓటు వేయడంలో నిర్లక్ష్యం వహిస్తే అనామకులను అనర్హులంను అందలం ఎక్కించిన వారమవుతామని ఈ గ్రామ ప్రజలు చెప్పుకొస్తున్నారు.

ఏకగ్రీవం రాజ్యాంగ హక్కును హరించడమే::….

అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే, ఆ గ్రామంలోని సామాన్య ప్రజలు విద్యావంతులు మేధావులు తమకు నచ్చిన వ్యక్తిని ఎంచుకునే రాజ్యాంగ హక్కును కోల్పోవడం ఎంతవరకు సమంజసం అని, ఎన్నికల్లో పోటీ లేకపోవడం వల్ల ఏకగ్రీవం అయిన నాయకుడు పోటీ చేసి గెలవాలనుకునే అభ్యర్థులు ఓటర్లు నిరుత్సాహానికి గురవుతున్నారని,ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసి తమ నాయకుడిని ఎన్నుకునే హక్కును హరించి వేస్తున్నారని, ఎన్నికల నియమావళిలో ఎలాంటి ప్రలోభాలకు తావుండదని రిజర్వేషన్ లు మారడంతో మాకు అవకాశం వచ్చిందని సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నామని సర్పంచ్ అభ్యర్థి బరిలో నిలిచిన జంగా కీర్తన ముఖేష్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ప్రజల ద్వారా ఎన్నుకోబడితే ప్రజలకు సేవ చేయాలని దృక్పథం కలుగుతుందని వారన్నారు.ఇంతకాలానికి మాకు పోటీ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని కీర్తనముఖేశ్ చెప్తున్నారు. నిత్యం ప్రజల మధ్యలో ఉండే మాకు ప్రజలు మంచి మెజారిటీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

