వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ కు వేడుకోలు
గత ప్రభుత్వంలో కానీ పనులపై నిరసనలు
వర్షాకాలం వచ్చిందంటే తప్పని తిప్పలు..
ప్రభుత్వం మారిన సమస్య తీరలే… మేడిపల్లి మండల ప్రజలు
రణం న్యూస్, మేడిపల్లి మండలం, ఆగస్టు 16:
స్వరాష్టం సాదించాక మా మండలంలో అభివృద్ధి పనులమాట దేవుడెరుగు కానీ ఆస్థులు కూడపెట్టుకోవడంలో అందెవేసిన చేయి మా నాయకులది..వ్యవస్థ అభివృద్ధి మాట దేవుడెరుగు వ్యక్తి అభివృద్ధి జరిగింది అనడంలో అతిశయోక్తిలేదు.కూటికి చిక్కిలేనోడు కోట్లకు పడగలెత్తిండు.. ఆ పాలన వద్దు అని మీ పాలన ముద్దు అనుకుని గెలిపించుకున్నాం.. మీరు మమ్మల్ని జర చూడుండ్రి అని వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ ను మేడిపల్లి ప్రజలు వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే..

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రం నుండి కూతవేటు దూరంలోనే ఉన్న కొండాపూర్ గ్రామ శివారులో గల మత్తడికి మోక్షం కలిగేది ఎన్నడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.శుక్రవారం రాత్రి నుండి కురుస్తున్న చిన్నపాటి వర్షానికి గ్రామంలో గల పెద్ద చెరువు నిండి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.వర్షాకాలం వచ్చినా ప్రతి సారిఉమ్మడి మేడిపల్లి మండల గ్రామాల ప్రధాన రహదారి అయిన కొండాపూర్ గ్రామం మీదుగా విలయతబాద్,కాచారం,వెంకటరావుపేట.రాగోజిపేట.ఒడ్యాడ్ వరకు వెల్లె ప్రయాణికులు, కొండాపూర్ గ్రామ రైతులు,ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
గతంలో వేములవాడ శాసనభ్యులుగా ఉన్న రమేష్ బాబుకి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకున్న దాఖలాలు లేవని, ప్రస్తుతం ఉన్న శాసన సభ్యులు అది శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్ళితే అధికారంలోకి వచ్చినా కొత్తలో కొంత సానుకూలంగా స్పందించారు కానీ ఇప్పటికైతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నంత చందంగా ఉంది.ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ఎంఎల్ఏ అది శ్రీనివాస్ ప్రత్యేక దృష్టి సారించింది సాధ్యమైనంత తొందరగా అక్కడ నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలని ఆ దారి గుండా వెల్లె మండల ప్రజలు కొండాపూర్ గ్రామస్తులు,రైతులు ఇతర గ్రామస్తులు.వాహనదారులు కోరుతున్నారు.

