అయో… మయంలో…అభ్యర్థులు
పదిరోజులు ఉపాధి చూపిస్తున్న ఎన్నికల జాతర..
రణం న్యూస్ డెస్క్:ఫిబ్రవరి10
ఏ ఎలక్షన్ వచ్చిన జనసందోహం తో ప్రచార హోరు జోరు అభ్యర్థుల అంచనాలను తలకిందులుగా చేస్తుంది.ప్రచారం లో జనాలు హుషారుగా పాల్గొంటున్నారు. అన్ని పార్టీ ల అభ్యర్థులతో అదే జనం దర్శనమిస్తున్నారు.పార్టీ అబ్యర్థులు వేరు కానీ అదే జనాలు అన్ని పార్టీల జెండాలతో అభ్యర్థుల తరుపున ఇంటింటా ప్రచారానికి తిరుగుతున్నారు. ఏ పార్టీ మీటింగ్ ఉందంటే జనం ఉత్సాహం గా పాల్గొంటున్నారు..ఇక్కడ అభ్యర్థులను అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తుంది. జయాపజయాలు ఎవరికి అంతుచిక్కడం లేదు.ఊహించిన విదంగా కాకుండా విరుద్దంగా ఫలితాలు వెలుబడే అవకాశాలు లేకపోలేదు. ఎలక్షన్ కమిషన్ ఎన్ని కఠిన నిబంధనలు అమలులో ఉన్న డబ్బు ఖర్చులకు ప్రత్యేక నియమాలతో హద్దులు మీరుతో అన్ని పార్టీలు ఇష్టారాజ్యంగా డబ్బులు వెదజల్లి జనాన్ని తరలించడం, ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
ఉపాధి గా మారిన ఎన్నికల ప్రచారం….
రోజువారీ పనులు చేసుకునేవారు ఇంటి పనుల్లో బిజీగా ఉండే మహిళలు బీడికార్మికులు గృహిణులు ఎన్నికల జాతరలో పాల్గొంటూ ఖర్చులు వెళ్లదీసుకుంటున్నారు ఇది కూడా ఐదు పది రోజులు ఉపాధి పొందతున్నారు.ఎక్కడ చూసినా విందుభోజనాలను తలపించే వాతావరణం తో వార్డులన్ని పండగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.ఈ ఎలక్షన్ పుణ్యమా అని రోజువారీ కూలితో పాటు మంచి విధుబోజనం,పురుషులకు అయితే మందు విందు మనీ తో నిత్యకళ్యాణం పచ్చతోరణం లా సాగిపోతుంది.ఓటరును ప్రసన్నం చేసుకోవడం లో అభ్యర్థులు ఈ ఎలక్షన్ పండలో నానాపాట్లు పడుతున్నారు..ఇది ఏమైనా ఓట్ల పండగతో ఈ పది రోజులు కొన్ని సామాన్య కుటుంబాలకు పని తిండి దొరకడం.జనానికి ఆదాయం సమకూరడం కూడా సంతోషించదగ్గ విషయమే.

