రణం: న్యూస్ జగిత్యాల:ఏప్రిల్21,సామాజిక ఉద్యమ నేత ప్రజాసంఘాల జేఏసీ, అంబేద్కర్ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ ను ప్రముఖ కళ సేవకులు కళాశ్రీ రాజు గుండెటి ఘనంగా సన్మానించారు.
శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో మిత్రులు పేట భాస్కర్ కు ఈమధ్యనే డాక్టరేట్, జాతీయ సేవ రత్న అవార్డులతో పాటు ప్రస్తుతం మహానీయులు బాబా సాహెబ్ బి ఆర్ అంబేద్కర్ జయంతోత్సవాల కమిటీ జిల్లా కన్వీనర్ గా వ్యవరించడం సంతోషకరమని భవిష్యత్తులో మరింత ఎదగలని కోరుతూ సన్మానించినట్లు కళాశ్రీ రాజు గుండెటి తెలిపారు. ఈసందర్భంగా పేట భాస్కర్ మాట్లాడుతూ తనను ఎప్పుడు ప్రోత్సాహించే పెద్దలు కళాశ్రీ రాజు కు ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో జయంతోత్సవాల కమిటీ సలహాదారులు, మాజీ కౌన్సులర్ బాలే శంకర్,దుమల రాజ్ కుమార్, గజ్జెల రాజు, నాయకులు దుమాల గంగారాం, బిరుదుల గంగారాం తదితరులు పాల్గొన్నారు.


