
రణం న్యూస్, సినిమా : బాలీవుడ్ స్టార్ నటుడు ఆమీర్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న లీడిరగ్ యాక్టర్లలో టాప్లో ఉంటారు. ఆయన్ని ముద్దుగా మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని కూడా పిలుస్తుంటారు. లగాన్, గజినీ, పీకే, దంగల్తోపాటు ఎన్నో బ్లాక్బస్టర్ హిట్స్ అందించి సక్సెస్ రేంజ్లో ఉన్న ఈ స్టార్ పర్సనల్ లైఫ్లో మాత్రం అంత హ్యాపీగా లేడనే చెప్పాలి. ఇప్పటికే ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమీర్ వయసు 59 ఏళ్లు. ఈ క్రమంలోనే ఆమీర్ ముచ్చటగా మూడో పెళ్లిక సిద్ధమైనట్లు తెలిసింది. బెంగళూరుకు చెందిన ఓ మహిళతో ఆమీర్ ఖాన్ గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఆమెను ఇటీవలే తన కుటుంబ సభ్యులకు కూడా పరిచయం చేసినట్లు టాక్. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అన్నీ కుదిరితే అతి త్వరలోనే ఆమీర్ మూడోసారి పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు నటుడి దగ్గరి వ్యక్తి ఒకరు చెప్పినట్లు జాతీయ మీడియాలో కూడా వరుస కథనాలు వస్తున్నాయి. ‘ఆమీర్ బెంగళూరుకు చెందిన ఓ మహిళతో డేటింగ్లో ఉన్నారు. వారి గోప్యతను గౌరవించి వ్యక్తిగత వివరాలు వెల్లడిరచలేను. ఆమెను ఆమీర్ తన కుటుంబ సభ్యులందరికీ పరిచయం చేశాడు. ఆ మీటింగ్ చాలా బాగా జరిగింది’ అంటూ సరదు వ్యక్తి చెప్పినట్లు మీడియా పేర్కొంది.