రణం న్యూస్, మేడిపల్లి మండలం, జూన్ 24:జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో రైతు పండగ సంబరాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వానాకాలం పంట రైతు భరోసా కేవలం 9 రోజులులోనే రైతులకు వ్యవసాయం కొరకు పెట్టుబడి సాయంగా 9 వేల కోట్లు నెరుగా రైతుల ఖాతలోకి జమచేయడం అనేది యావత్ దేశం హర్షించదగిన విషయం అని అన్నారు. వ్యవసాయం అంటే దండగా అనే పరిణామం నుండి వ్యవసాయం పండుగ అనేలా కృషి చేస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సహకరించిన ఆర్థికమంత్రి మల్లు బట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి మేడిపల్లి మండల రైతుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, సీనియర్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
