బీడీ వర్కర్స్ పెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి సుతారి రాములు

రణం న్యూస్ ,జగిత్యాల మే10,
కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు ఉపసంహరించాలని దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ను విజయవంత చేయాలని ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుతారి రాములు తెలిపారు శనివారం రోజు ఈ ప్రభాకర్ భవన్లో మాట్లాడుతూ కేంద్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు అవలంబిస్తూ స్వతంత్రం పూర్వం బ్రిటిష్ పాలకులతో పోరాడి సాధించుకున్న 29 చట్టాలను నాలుగు లేబర్ కోడులుగా విభజించి కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న విధానాలకు నిరసనగా భారతదేశంలోని జాతీయ రాష్ట్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ప్రేడరేషన్లు అసోసియేషన్లు మేరకు ఈ నెల 20వ తారీకున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో బీడీ కార్మికులు పాల్గొంటారని బీడీ పరిశ్రమ యజమానులకు సమ్మె నోటీసు నిజాంబాద్ లోని యజమానుల ప్రతినిధులకు అందజేయడం జరిగిందని వివరించారు ప్రధానంగా కనీస వేతనాలు చట్టం అమలు చేయాలని అసంఘటిత రంగ కార్మికులకు కనీస పెన్షన్ 6000 ఇవ్వాలని స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వ్యవసాయ రైతు సంఘాల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈ సమ్మెలో పాల్గొంటున్నామని తెలిపారు ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు బి గోవర్ధన్ నేతలు ఎండి ముఖం భానుచందర్ తదితరులు పాల్గొన్నారు