స్థలం కబ్జా చేసి నిర్మాణం చేశారని
విశ్రాంత ఉద్యొగి ఆవేదన..
రణం: న్యూస్ కోరుట్ల:, ఏప్రిల్ 22
అతనొక సామాన్యమైన వ్యక్తి కస్టపడి పైసా పైసా పోగు చేసుకుని స్థలాన్ని కొనుగోలు చేసుకున్నాడు అతని పేరు మీద రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయి.ఇంటి నిర్మాణముకు సంబంధించిన అనుమతులు ఉన్నాయి. వివారాల్లోకి వెళితే యేలేటి నర్సయ్య అనే విశ్రాంత ఉద్యోగిపట్టణంలో ని 105,106 సర్వే నెంబర్ లో 300చదరపు గజాలా స్థలాన్ని పట్టాదారుతో దస్తవేజ్ నెంబర్ 366 /2018 ..100గజాలు, దస్తవేజ్ నెంబర్ 6095/2019 లో 200 గజాలు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇంటి నిర్మాణానికి అనుమతులుపొంది ఎల్ అర్ ఎస్ నిబంధనల ప్రకారం పురపాలక సంఘానికి స్థలాన్ని కూడా ఇచ్చానని, ఆ రెసిప్ట్ కూడా ఉందని కబ్జా మోకా పై ఉన్నా గాని స్ధలం ఖాళీగా ఉందని కొందరు పెన్షనర్ సంగం పేరిట ఎలాంటి డాక్యూమెంట్ లేకుండా రేకుల షెడ్ నిర్మించి నా స్థలాన్ని కబ్జా చేశారని, ఇట్టి స్థలంలో నిర్మాణాన్ని తొలగించాలని కోర్టులో కేసు దాఖలు చేశారు.ఆ కేసు విషయంలో హైకోర్టు కూడా నిర్మాణాన్ని తొలగించాలని అర్దరూ కూడా ఇచ్చిందని నర్సయ్య తెలిపారు.ఈ అక్రమ నిర్మాణాన్ని తొలగించాలనే హైకోర్టు ఆర్దరు ను మున్సిపల్ కమిషనర్ కు ఆర్డీఓ కు సమర్పించిన ఎలాంటి స్పందన లేదని నర్సయ్య వాపోయారు. విషయం మున్సిపల్ కమీషనర్ ను ఆర్డీఓ ను పలుసార్లు కలిసి విన్నవించుకున్న తమకు న్యాయం జరగటం లేదని నర్సయ్య అసహనం వ్యక్తం చేశారు. ఏదీ ఏమైనా అమాయకుల ఖాళీ స్థలం కనపడితే కబ్జా లు జరుగుతున్న అధికారులు స్పందించకపోవడం ప్రశ్నఅర్థకమే

